ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: మ్యూజియం ధ్వంసం
న్యూఢిల్లీ: వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం నాడు ఢిల్లీలోని టీవీ టవర్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం మరువక ముందే మరో అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఫిక్కీ ఆడిటోరియంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ఫిక్కీ ఆడిటోరియంలోని పై అంతస్తులోని మ్యూజియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి కాలం కావడంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆడిటోరియం మొత్తానికి మంటలు వ్యాపించాయి. మ్యూజియంలోని పై అంతస్తులో మొదలైన మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.

దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. 37 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయలైనట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాదం రాత్రి పూట సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది. భవంతిలో కొద్ది మంది మాత్రమే ఉండటంతో వెంటనే వారిని బయటకు పంపించివేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే సరికే మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఢిల్లీ అగ్నిమాపక డిపార్ట్‌మెంట్ చీఫ్ మాట్లాడుతూ ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.
WATCH: Fire which broke out at Delhi's Natural History Museum at around 2 am today morning (earlier visuals)https://t.co/ygh6K86G4Y
— ANI (@ANI_news) April 26, 2016












Click it and Unblock the Notifications