చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

karate master: కరాటే మాస్టర్ ను చంపిన రైతు, చంద్రారెడ్డికి కోపం వచ్చింది, మాస్టర్ ఏం చేశాడంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: కొబ్బరి తోటలో కొబ్బరి చెట్లకు నీళ్లు తోలాలని కరాటే మాస్టర్, అతని కొడుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న బంధువుల పొలంలో నుంచి నీళ్ల ట్యాంకర్ కరాటే మాస్టర్ తోటలకు వెళ్లింది. తండ్రి కొబ్బరి చెట్టకు నీళ్లు పడుతుంటే అతని కొడుకు వీడియోలు తీస్తున్నాడు. ఆ సందర్బంలో కొబ్బరి తోట యజమాని అక్కడికి వెళ్లాడు. తన కొబ్బరి తోటలో నుంచి టాక్టర్ నడుపుతారా అంటూ కరాటే మాస్టర్ మీద తోట యజమాని దాడి చేశాడు. తరువాత చేతిలో ఉన్న కొడవలితో కరాటే మాస్టర్ ను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు.

couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?

కరాటే మాస్టర్

కరాటే మాస్టర్

తమిళనాడులోని వేలూరు జిల్లా (చిత్తూరు జిల్లా సమీపంలో)కు ఆనుకుని ఉన్న రాణిపేట్ జిల్లాలోని అరక్కోణం తాలూకా కిలవణం గ్రామంలో భాస్కర్ (43) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అరక్కోణంలోని ఓ ప్రైవేట్ టైర్ల ఫ్యాక్టరీలో భాస్కర్ ఉద్యోగగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న భాస్కర్ ఆ ప్రాంతంలో కరాటే మాస్టర్ గా కూడా పని చేస్తున్నాడు.

కొబ్బరి తోట యజమానులు

కొబ్బరి తోట యజమానులు

అదే గ్రామంలో భాస్కర్‌ బంధువు ఆంజనేయరెడ్డి, అతని కుమారుడు చంద్రన్‌ అలియాస్ చంద్రారెడ్డి, అతని భార్య జ్యోతి నివాసం ఉంటున్నారు. భాస్కర్‌ ఆస్తి, చంద్రన్ ఆస్తి పక్కపక్కనే ఉన్నాయి. చంద్రన్ అతని ఆస్తిలో కొబ్బరి చెట్టు పెట్టాడు. భాస్కర్ కూడా అతని ఆస్తిలో కొబ్బరి చెట్టు నాటించాడు. భాస్కర్ అతని పొలంలోని కొబ్బరి చెట్లకు కొంతకాలంగా నీళ్లు పడుతున్నాడు.

కరాటే మాస్టర్ ను నరికేశాడు

కరాటే మాస్టర్ ను నరికేశాడు

భాస్కర్ చెట్లకు నీళ్లు పడుతుంటే అతని కుమారుడు ఆకాష్ దగ్గర నుంచి వీడియో తీశాడు. అదే సమయంలో చంద్రన్ అక్కడికి వెళ్లాడు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు రా అంటూ ఆవేశంతో కరాటే మాస్టర్ మీద ఊగిపోయాడు. ఆ సందర్బంలో కోపోద్రిక్తుడైన చంద్రన్ కొబ్బరిచెట్టులో నారు కోసేందుకు ఉపయోగిస్తున్న కొడవలి తీసుకుని కరాటే మాస్టర్ భాస్కర్ ను అతని కుమారుడు ఆకాష్ ఎదుటే నరికేశాడు.

కొడుకు మీద దాడి చెయ్యాలని ?

కొడుకు మీద దాడి చెయ్యాలని ?

చంద్రన్ దాడి చెయ్యడంతో కరాటే మాస్టర్ భాస్కర్‌ రక్తపుమడుగులో స్పృహతప్పి పడిపోయాడు. వీడియో తీసిన ఆకాశ్ మీద కూడా దాడి చెయ్యాలనిచంద్రన్ ప్రయత్నించాడు. మర్యాదగా వీడయో తియ్యడం నిలుపు అంటూ ఒక్కసారిగా చంద్రన్ వెంబడించడంతో అకాష్ అక్కడి నుంచి పరిగెత్తి తప్పించుకుని వెళ్లి అతని కుటుంబ సభ్యులు, బంధువులకు విషయం చెప్పాడు. తీవ్రంగా గాయపడిన కరాటే మాస్టర్ భాస్కర్‌ను అంబులెన్స్‌లో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కరాటే మాస్టర్ ప్రాణం పోయింది

కరాటే మాస్టర్ ప్రాణం పోయింది

తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న కరాటే మాస్టర్ భాస్కర్ మృతి చెందాడు. ఈ విషయం విని భాస్కర్ బంధువులు తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి దగ్గర ఆర్తనాదాలు చేశారు. కరాటే మాస్టర్ భాస్కర్ ను అతని కొడుకు ఆకాష్ కళ్ల ముందే నరికి చంపిన చంద్రన్ దర్జాగా తోటలోనే ఉన్నాడు. అరక్కోణం పోలీసులు కేసు నమోదు చేసి కరాటే మాస్టర్ ను హత్య చేసిన రైతు చంద్రన్‌ను అరెస్టు చేసి అరక్కోణం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు.

English summary
Master: The farmer who hacked the karate master to death in Ranipet near Vellore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X