హీరో విజయ్ కూడా మునిగేవాడే: తెప్ప కాపాడింది
బెంగళూరు: మాస్తిగుడి కన్నడ సినిమా క్లైమాక్స్ చిత్రాల దృశ్యీకరణలో నీటిలో మునిగి హీరో విజయ్ కూడా ప్రాణాలు కోల్పోవాల్సినవాడే. కానీ అదృష్టవశాత్తు అతను బతికి బయటపడ్డాడు. 'మాస్తిగుడి' కన్నడ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ కన్నడ సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.
నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి విలన్లు ఉదయ్, అనిల్ మరణించారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో హీరో విజయ్ కూడా నీట మునిగిపోవాల్సిన వాడేనని చెబుతున్నారు.

అదృష్టం బాగుండి సమీపంలోని మత్స్యకారుల తెప్ప కంట పడిందని సమాచారం. దాంతో అతన్ని చివరి క్షణంలో కాపాడగలిగారు. ఈ లోపు మిగిలిన ఇద్దరిని కూడా కాపాడాలని భావించినా వారు ఈతరాక నీట మునిగారు.
కాగా, హీరో విజయ్, విలన్లు అనీల్, ఉదయ్ ముగ్గురు 100 అడుగు ఎత్తు నుంచి నీళ్లలోకి దూకవలసి ఉంది. అయితే సినిమా యూనిట్ సభ్యులు మాత్రం హీరో విజయ్ కు మాత్రం లైఫ్ జాకెట్ ఇచ్చారు. ఇద్దరు విలన్లకు కనీసం షర్టులు కూడా లేవు.
మాస్తిగుడి కన్నడ సినిమా క్లైమాక్స్ చిత్రాల దృశ్యీకరణలో నీటిలో మునిగి హీరో విజయ్ కూడా ప్రాణాలు కోల్పోవాల్సినవాడే. కానీ అదృష్టవశాత్తు అతను బతికి బయటపడ్డాడు. 'మాస్తిగుడి' కన్నడ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ కన్నడ సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.












Click it and Unblock the Notifications