కాలేజీల్లోనూ విద్యార్థినులకు ప్రసూతి సెలవులు: హైకోర్టు సంచలన తీర్పు!
మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహం, గర్భధారణ అనేవి ఏ విద్యార్థిని ఉన్నత విద్యకు ఆటంకం కాకూడదని స్పష్టం చేసింది. ప్రసూతి/శిశు సంరక్షణ సెలవులు, హాజరు సడలింపు, విద్యాపరమైన సాయం అందించాలని విద్యాసంస్థలను ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ ప్రదీప్ మిట్టల్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కార్యాలయ మహిళలకు లభించినట్లే, విద్యార్థినులకు ప్రసూతి రక్షణ హక్కు వర్తిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. గర్భధారణ లేదా ప్రసవం పేరుతో పరీక్షలకు దూరం చేయడం విద్యా హక్కులను నిర్వీర్యం చేయడమేనని పేర్కొంది.
భోపాల్‌కు చెందిన ప్రభుత్వ యునాని కళాశాలలో బి.యు.ఎం.ఎస్ (BUMS) ద్వితీయ సంవత్సరం చదువుతున్న రుమైసా అర్వా అనే విద్యార్థిని చదువుకుంటున్న సమయంలోనే వివాహం చేసుకుని గర్భం దాల్చింది. నవంబర్ 20, 2024న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గర్భం, ప్రసవం కారణంగా ఆమె తరగతులకు రెగ్యులర్‌గా హాజరు కాలేకపోయింది. కాలేజీ నిబంధనల ప్రకారం 75శాతం అటెండెన్స్ ఉండాలి, కానీ ఆమెకు 56.64శాతం మాత్రమే ఉంది. కళాశాల యాజమాన్యం ఆమెకు కేవలం 10శాతం మినహాయింపు ఇచ్చి, పరీక్షలు రాసేందుకు నిరాకరించింది. రుమైసా పరీక్షలకు దూరమైంది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన హైకోర్టు విద్యార్థినుల పట్ల విద్యాసంస్థలు అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన కారణంతో ఒక విద్యార్థినిని పరీక్షలకు అనుమతించకపోవడం ఆమె ప్రాథమిక విద్యా హక్కులను హరించడమే అవుతుంది. 2021లోనే యూజీసీ (UGC) అన్ని విద్యాసంస్థలకు విద్యార్థినుల కోసం ప్రసూతి సెలవుల పాలసీని రూపొందించాలని ఆదేశించినా, సదరు కళాశాల ఇప్పటికీ ఎటువంటి పాలసీని రూపొందించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. పని చేసే చోట మహిళలకు దక్కే ప్రసూతి రక్షణే, చదువుకునే మహిళలకు కూడా దక్కాలని కోర్టు అభిప్రాయపడింది.
రేణుక వర్సెస్ యూజీసీ కేసు ప్రస్తావన
ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన 'రేణుక వర్సెస్ యూజీసీ' తీర్పును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రసూతి ప్రయోజనాలు పొందడం అనేది మహిళల రాజ్యాంగపరమైన హక్కు అని ఆ తీర్పు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు రుమైసా అర్వా కేసును 'ప్రత్యేక కేసు'గా పరిగణించి, ఆమెను పరీక్షలకు అనుమతించాలని, అకడమిక్ సహకారం అందించాలని కళాశాలను ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థినులకు గొప్ప ఊరటనివ్వనుంది. గర్భధారణ కారణంగా చదువు మధ్యలో ఆపేస్తున్న వేలాది మంది మహిళలకు ఈ నిర్ణయం కొత్త ఆశలను కల్పిస్తుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications