పట్టపగలే చీకట్లు పడే ప్రాంతం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన హిల్ స్టేషన్..
హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలను కవర్ చేశారా..? మహారాష్ట్రలో పర్యటించాలని ఉందా..? మహారాష్ట్రలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, మహాబలేశ్వర్ ప్రాంతంలోని హిల్ స్టేషన్లు.. గేట్ వే ఆఫ్ ఇండియాగా పిలిచే ముంబై నగరం.. ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయం అలాగే లోనావాలా, ఖండాలా జలపాతాలు వీటితోపాటు ఛత్రపతి శంభాజీ నగర్ ఇలా అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి.
వీటిలో ముఖ్యమైనది మాథేరాన్ హిల్ స్టేషన్.. రద్దీకి దూరంగా.. నిర్మానుష్యంగా ఉండే ఈ కొండ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశంలోకి కార్లు, బస్సులు అనుమతి లేదు. నడక మార్గం, ట్రెక్కింగ్ ద్వారానే ఇక్కడకు చేరుకోవాలి. ఈ హిల్ స్టేషన్ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అలాగే పర్వతాల నుంచి వచ్చే స్వచ్చమైన గాలి.. ఇక్కడి వాతావరణం తనివితీరా ఆస్వాదించే అవకాశం ఉంది. అందుకే మహారాష్ట్రలోని టాప్ 10 పర్యాటక ప్రాంతాల్లో మాథేరాన్ ఒకటిగా ఉంది.
మాథేరాన్ లో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు.. పనోరమా పాయింట్, లూయిసా పాయింట్, షార్లెట్ లేక్, ఎకో పాయింట్, పోర్కుపైన్ పాయింట్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సందర్శించేందుకు ఉత్తమమైన సమయం అక్టోబర్ నుంచి మే వరకు అని స్థానికులు చెబుతున్నారు. ఇక మాథేరాన్ ప్రదేశానికి ఓ స్పెషాలిటీ ఉంది. పట్టపగలే ఈ ప్రాంతంలో చీకట్లు కమ్ముకుంటుంది. దానికి ఓ కారణం ఉంది. మాథేరాన్ ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది.
ఇక్కడి దారులకు ఇరువైపులా భారీ వృక్షాలు ఉంటాయి. ఆకులు పైన ఒక కప్పు లాగా అల్లుకుపోతాయి. దీని వల్ల ఎండ తగలదు. అందువల్ల పట్టపగలు కూడా చీకట్లు పడినట్లుగా కనిపిస్తాయి. ఎండైనా.. వానైనా గొడుగు పట్టే అవకాశం లేకుండానే దట్టమైన చెట్ల నీడలోనే నడవచ్చు. ఇక్కడ దాదాపు 38 కు పైగా వ్యూ పాయింట్లు ఉన్నట్లు సమాచారం. ఇక్కడి దట్టమైన పొగమంచు, కొండల నడుమ సాగే నేచర్ వాక్స్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

ఇక్కడకు చేరుకోవాలంటే పర్యాటకులు తమ సొంత కార్లు లేదా ట్యాక్సీలలో 'దస్తూరి నాకా' వరకు మాత్రమే వెళ్లగలరు. అక్కడి నుంచి ఊరిలోకి నడిచి వెళ్లాల్సిందే. నడవలేని వారికి గుర్రాలు, చేతితో లాగే రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ ప్రాంతానికి చేరువలో ఉన్న విమానాశ్రయం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం.. రైలు ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నేరల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అదే బస్సు ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే దస్తూరి నాకా బస్ స్టాండ్ ఉంటుంది.












Click it and Unblock the Notifications