Mathrubhumi News- P MARQ Survey: ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏదే హవా, ఇండియా కూటమి డీలా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్నవేల పలు జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఏ పార్టీకి ఎన్నిక సీట్లు వస్తాయనేదానిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా ఎన్డీఏ, ఇండియా కూటములకు వచ్చే సీట్లపై అంచనాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా, మాతృభూమి న్యూస్-పీ మార్క్యూ సర్వే ఒపీనియన్ పోల్ అంచనాలను విడుదల చేసింది.
బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అంచనాలను గమనించినట్లయితే.. ఈ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 32-38 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక ఇండియా కూటమికి 2-10 స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న కర్ణాటక రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఎన్డీఏ కూటమి 24-27 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక ఇండియా కూటమికి 1-4 లోక్‌సభ సీట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది.
బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్డీఏకు అత్యధికంగా 23-25 స్థానాలు దక్కే అవకాశం ఉందని మాతృభూమి న్యూస్-పీ మార్క్యూ సర్వే తెలిపింది. ఇండియా కూటమికి 0-2 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమికే అత్యధిక స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చినట్లయింది.
కాగా, దక్షిణాధిలో కర్ణాటకలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక, కేరళ, తమిళనాడులో గతం కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకోనుంది. మరోవైపు, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ బీజేపీకి గతం కంటే మెరుగైన ఫలితాలను దక్కించుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications