మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్: జమ్మూకాశ్మీర్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ, హంగ్ తప్పదా?
జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై పలు మీడియా ఛానళ్లు, సర్వే సంస్థలు శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. జమ్మూకాశ్మీర్‌లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో జమ్మూకాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..90 అసెంబ్లీ స్థానాలు కలిగిన జమ్మూకాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 11-15 స్థానాలు, పీడీపీకి 28, బీజేపీకి 25-31 స్థానాలు, కాంగ్రెస్ 12, ఏఐపీ 0-2, ఇతరులు -1 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. మ్యాట్రిజ్ అంచనాల ప్రకారం జమ్మూకాశ్మర్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

అయితే, ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో మరోసారి పీడీపీతో బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. లేదంటే పీడీపీ.. ఎన్సీ, కాంగ్రెస్ పార్టీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలోని 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. మెజార్టీ స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సాధించగా.. రెండోస్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచాయి. పీడీపీ నాలుగో స్థానానికే పరిమితమైంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా లప్రకారం.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NC)కి 33-35 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ 23-27, కాంగ్రెస్ పార్టీ 13-15, పీడీపీ 7-11, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో ఎన్సీతో కలిసి కాంగ్రెస్ జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్మూ కాశ్మీర్ లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫిరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications