బీజేపీ గెలుపుతో రాజీనామాలు: ఎమ్మెల్యే పదవికి అల్కా, కాంగ్రెస్ పదవికి అజయ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుంధుభి మోగించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కీలక నేతల రాజీనామాల పర్వం మొదైలంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓటమితో ఆ పార్టీ ఎమ్మెల్యే అల్కా లంబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు.
కాగా, 'నా నియోజకవర్గంలోని మూడు వార్డుల్లో ఆప్ ఓటమి పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నాను' అని అల్కాలంబా ట్వీట్ చేశారు. అయితే కేజ్రీవాల్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని లంబా అన్నారు.
అల్కాలంబా చాందీని చౌక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు పార్టీలో ముఖ్యమైన పదవులేం లేకపోవడం గమనార్హం. గత సంవత్సరం ఆప్ అధికార ప్రతినిధుల ప్యానెల్ నుంచి లంబాను తొలగించడం జరిగింది.

అజయ్ మాకెన్ రాజీనామా
ఇది ఇలా ఉండగా, ఢిల్లీ నగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్... పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఇకపై పార్టీలో సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తానని చెప్పారు. ఢిల్లీ నగర పాలక ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడిన విషయం తెలిసిందే. స్పష్టమైన ఆధిక్యంతో మూడు నగరపాలక సంస్థలను బీజేపీ కైవసం చేసుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు నిలిచాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications