ట్విస్ట్: ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు మేజరే, మళ్ళీ పరీక్షలు
లక్నో:ఉన్నావ్ అత్యాచార కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. బాధితురాలు మైనర్ కాదు మేజర్ అంటూ వైద్యులు ఇచ్చిన నివేదికతో గందరగోళం నెలకొంది. యువతి మైనర్‌గా భావించిన పోలీసులు బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.కానీ, బాధితురాలి వయస్సు 19 ఏళ్ళని వైద్యులు నిర్ధారించడంతో వయస్సు నిర్దారణ కోసం మళ్ళీ పరీక్షలు నిర్వహించారు. నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
ఉన్నావ్ రేప్ కేసు వెలుగు చూసిన తర్వాత 2017 జూన్ 22న పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రేడియాలజిస్టు ఎస్ జోహ్రీ బాధితురాలు మేజర్ అని నివేదికను ఇచ్చారు. అప్పటికే ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయమై బాధితురాలు ఎమ్మెల్యే పేరును మేజిస్ట్రేట్ ఎదుట చెప్పలేదు. ఆ తర్వాత రెండో ఎఫ్ఐఆర్ లో బిజెపి ఎమ్మెల్యే సెంగార్ పేరును బాధితురాలు ప్రస్తావించారు. 2018 ఏప్రిల్ 12న ఎమ్మెల్యేపై ఫోక్సో చట్టం ప్రకారంగా కేసు నమోదు చేశారు.

మొత్తంగా ప్రాథమిక వైద్య పరీక్షలో ఆమె వయస్సు 19 ఏళ్ళుగా ఉన్న విషయాన్ని సీబీఐ గుర్తించింది. కేసులు మాత్రం మైనర్‌పై అత్యాచారం చేసినప్పుడు వర్తించే కేసును పెట్టారు. దీంతో బాధితురాలికి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయం తసీుకొంది. ఈ మేరకు శనివారం నాడు బాధితురాలికి లక్నో ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా కేసు సెక్షన్ల మార్పిడి చేయాలని సీబీఐ భావిస్తోంది. బాధితురాలు మైనర్ కాదని తేలితే సెక్షన్లు మార్చి దర్యాప్తును కొనసాగిస్తారు. మైనర్‌గా తేలితే అదే సెక్షన్లతో కేసును కొనసాగించనున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications