Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుణ్యానికి పోతే పాపం: అతన్ని మెడికో చంపేశాడు

చెన్నై: సలహా ఇవ్వడమే ఓ మాజీ సైనికుడి పాపమైంది. చదువుకోవాలని చెప్పినందుకు ఓ మెడికో చేతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు మెడికో సైకోలా మారిమాజీ సైనికుడిని కత్తితో పొడిచి చంపేశాడు.

తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. కన్యాకుమారి జిల్లా శివనికుళంకు చెందిన కుమార్‌ అనే కాంట్రాక్టర్‌ కుమారుడు సంతోష్‌కుమార్‌ (25) చిదంబరంలోని ఒక ప్రైవేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు.

Medico kills ex serviceman in Kanyakumari

ఇటీవల తన సొంతూరికి వచ్చిన సంతోష్‌కుమార్‌ అప్పటి నుంచి కాలేజీకి వెళ్లడం మానేశాడు. పరీక్షలు దగ్గరపడుతున్నప్పటికీ ఇంటివద్దనే ఉండిపోవడంతో తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని పదే పదే ఒత్తిడిచేశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి కుమార్‌ మాజీ సైనికుడైన కేరళలోని తన స్నేహితుడు నౌషాద్‌ వద్ద బాధపడ్డాడు.

తన కుమారుడికి నచ్చ చెప్పాల్సిందిగా వేడుకున్నాడు. దాంతో శివనికుళంలోని కుమార్‌ ఇంటికి వచ్చిన నౌషాద్‌ ఎట్టకేలకూ ఒప్పించాడు. శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటలకు చిదంబరం వెళ్లేందుకు సిద్ధమవుతూ నౌషాద్‌తో ఘర్షణ పడి విచక్షణారహితంగా పలుమార్లు కత్తితో పొడిచాడు. దాంతో నౌషాద్‌ ప్రాణాలు విడిచాడు. సంతోష్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+