Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్ధరాత్రి జననం: చిన్నారికి జిఎస్టీ అని పేరు పెట్టిన తల్లి

గత కొద్ది రోజులుగా జిఎస్టీపై చర్చ సాగుతోంది. జనవరి 30 అర్ధరాత్రి 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోడీలు సంయుక్తంగా జిఎస్టీని లాంచ్ చేశారు.

జైపూర్: గత కొద్ది రోజులుగా జిఎస్టీపై చర్చ సాగుతోంది. జూన్ 30 అర్ధరాత్రి 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోడీలు సంయుక్తంగా జిఎస్టీని లాంచ్ చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఇది అతిపెద్ద పన్ను సంస్కరణ.

ఇదే జిఎస్టీ పేరును ఓ తల్లి తన పాపాయికి పెట్టుకుంది. జిఎస్టీ అమలవుతున్న రోజునే పాపాయి జన్మించింది. అందుకు గుర్తుగా ఉంటుందని ఆ పాప తల్లి తన బిడ్డకు జీఎస్‌టీ అని పేరు పెట్టుకుంది.

Meet 'GST': Mother names child after India's biggest tax reform

రాజస్థాన్‌లోని బీవర్‌ ఆసుపత్రిలో ఓ మహిళ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు పండంటి పాపాయికి జన్మనిచ్చింది. అప్పుడే జిఎస్టీ కూడా ప్రారంభం కావడంతో పాపకు జీఎస్‌టీ అని పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తల్లి చెప్పింది.

జిఎస్టీని ఎత్తుకొని ఆ తల్లి ఫొటోలు దిగుతూ తెగ మురిసిపోయింది. ఈ పేరుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ట్వీట్ చేశారు. జిఎస్టీ (చిన్నారి) కలకాలం జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+