సీఎంగా కుమారస్వామి: భార్య, హీరోయిన్ రాధిక గురించి తెగ వెతుకుతున్నారు
Recommended Video

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో అయిదు రోజుల పాటు కన్నడ నాట డ్రామా నడిచింది. యెడ్డీ ప్రమాణం, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించడం, ప్రొటెం స్పీకర్ నియామకం, గవర్నర్ తీరు, సుప్రీం కోర్టు జోక్యం.. ఇలా ఎన్ని మలుపుల అనంతరం యెడ్డీ రాజీనామా చేశారు. ఇప్పుడు కర్ణాటక కొత్త సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బుధవారం మధ్యాహ్నం గం.12.30కు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా, కుమారస్వామి సీఎంగా అవుతున్న నేపథ్యంలో ఆయన భార్య రాధికా కుమారస్వామి బాగా గూగుల్‌లో ట్రెండ్ అవుతున్నారు.

కన్నడ పరిశ్రమలో సుపరిచితం
కన్నడ పరిశ్రమలో రాధిక అందరికీ తెలుసు. ఆమె నటి మరియు నిర్మాతగా వ్యవహరించారు. పన్నెండేళ్ల క్రితం అంటే 2006లో ఆమె కుమారస్వామిని పెళ్లాడారు. వీరికి ఓ కూతురు ఉంది. ఆమె పేరు షమిక కే స్వామి. రాధికా కుమారస్వామి 2002లో నీల మేఘ శ్యామతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తొమ్మిదో తరగతి చదవగానే ఈ ఫీల్డులోకి వచ్చింది.

రాజకీయాల్లోకి వస్తారనుకున్నారు కానీ
31 ఏళ్ల రాధిక 30కి పైగా సినిమాలలో నటించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రాధిక రాజకీయాల్లోకి వస్తారని కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఆమె సుముఖంగా లేదని కూడా అప్పుడే వార్తలు వచ్చాయి. రాధికా కుమారస్వామి చివరి చిత్రం ఈశ్వర్. వివాహం నేపథ్యంలో ఆ సినిమా ఆ తర్వాత బయటకు రాలేదు.

2006లో పెళ్లయింది
కుమారస్వామికి 58 ఏళ్లు. అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్లు. 2005లో రాధికా - కుమారస్వామిలకు పరిచయమైంది. 2006లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అంటే 2010లో అందరికీ వివాహం గురించి తెలిసింది.

తమిళ సినిమాల్లోను ప్రతిభ
అటు రాధిక, ఇటు కుమారస్వామిది.. ఇద్దరిదీ రెండో వివాహమే. రాధిక 2000లో ఆమె రతన్ కుమార్‌ను పెళ్లాడారు. అప్పటికి ఆమె వయస్సు పద్నాలుగు. రెండేళ్లకు రతన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అతను 2002లో కన్నుమూశాడు. కుమారస్వామి 1986లో అనితను వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ గౌడ కుమారుడు ఉన్నారు. తమిళ సినిమాల్లోను రాధిక ప్రతిభ చూపారు.

సెర్చింగ్ సమయంలో రాధిక
కుమారస్వామి కర్ణాటక సీఎం అవుతున్న నేపథ్యంలో అందరూ ఆయన గురించి సెర్చ్ చేస్తున్నారు. సెర్చింగ్ సమయంలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. రాధికా కుమారస్వామి మే 18న గూగుల్ సెర్చింగ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఆమె ప్రముఖ కన్నడ నటి, కుమారస్వామి భార్య కావడంతో ట్రెండింగ్‌గా మారింది.

రాధికను పెళ్లాడిన ఏడాదిలోనే సీఎంగా
సినీ నిర్మాత నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగిన కుమారస్వామి... నటి రాధికను పెళ్లి చేసుకున్న 2006లోనే ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధికా కుమారస్వామి ఫ్యామిలీ ఫొటోలు ఆన్‌లైన్‌లో గతంలోను వైరల్‌గా మారాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications