ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మేఘాలయ.. బెస్ట్ టైమ్ ఎప్పుడంటే..?

దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో మేఘాలయ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మేఘాలయ.. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో బెస్ట్ టూరిస్ట్ ప్రాంతంగా మేఘాలయ ఉంటోంది. ఈ రాష్ట్రంలోని సహజమైన వాతావరణం, అబ్బుర పరిచే జలపాతాలు, దట్టమైన అడవులు.. అలాగే ఖాసీ, జైంతియా, గారో వంటి తెగల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. అయితే మేఘాలయకు ఎప్పుడు వెళ్లాలి అనే సందేహం పర్యటకుల్లో ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లడానికి జనవరి, ఫిబ్రవరి నెలలు బెస్ట్ టైమ్ గా చెబుతున్నారు.

ఎటుచూసినా అందమైన ప్రకృతి.. ముఖ్యంగా పచ్చని తివాచి పరిచినట్లుగా కనిపించే సుందర మనోహరమైన లోయలు, నదులు, పర్వతాలను చూడాలంటే మేఘాలయకు వెళ్లాల్సిందే. శీతాకాలంలో మేఘాలయను సందర్శిస్తే గొప్ప అనుభూతి ఉంటుంది. అయితే మేఘాలయలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో లివింగ్ రూట్ వంతెనలు బాగా ప్రాచుర్యం పొందాయి. మేఘాలయలో దట్టమైన అడవులు, కొండలు ఉంటాయి. ఈ అడవుల్లో లివింగ్ రూట్ బ్రిడ్జ్ లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ఖాసీ తెగ ప్రజలు రబ్బరు చెట్ల సాయంతో ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. చిరపుంజి, మావ్లిన్నాంగ్‌ వంటి ప్రదేశాల్లో ఈ లివింగ్ రూట్ వంతెనలు దర్శనం ఇస్తాయి.

ఆ తర్వాత లైట్లం కాన్యన్ కు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి సుమారు గంట ప్రయాణం చేస్తే లైట్లం కాన్యన్‌ కు చేరుకోవచ్చు. పర్వతం అంచు నుంచి ప్రకృతి సోయగాలను ఈ ప్రదేశంలో తనివితీరా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో మంచుతో కప్పేసి ఉండే ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తే.. మళ్లీ, మళ్లీ ఇక్కడికి రావాలని ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఎంత వర్ణించినా తక్కువే.

అలాగే మేఘాలయలో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా క్రాంగ్ సూరి జలపాతం ఉంది. ఈ జలపాతం షిల్లాంగ్ ‌కు ఆగ్నేయంగా ఉంటుంది. షిల్లాంగ్‌ నుంచి మూడు గంటలు ప్రయాణం చేస్తే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే ఈ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ జలపాతం వద్ద పర్యాటకంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పిల్లలు, ఫ్యామిలీతో వెళ్లేవారు బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

Meghalaya Abode of Clouds and Living Wonders

మరో ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ఉమ్‌ గోట్ నది ఉంది. మావ్లిన్నోంగ్‌ కు తూర్పు దిశలో గంట ప్రయాణం చేస్తే డౌకి అనే చిన్న పట్టణం వస్తుంది. ఈ పట్టణం సమీపంలోని ఉమ్‌ గోట్ నది ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది. అత్యంత స్వచ్ఛంగా ఉండే ఈ నది లోపలి భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నదిలో పడవ ప్రయాణంతో పాటు.. నది అందాలకు పర్యాటకులు మంత్ర ముగ్దులు అవుతారు. ఇక దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో మేఘాలయలోని చిరపుంజి, మాసిన్ రోమ్ ఉన్నాయి. ఇక్కడి ప్రాంతాల్లో వర్షాన్ని ఎంజాయ్ అనుకునేవాళ్లు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఈ ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+