మేఘాలయా స్పీకర్,మాజీ సీఎం కన్నుమూత

మేఘాలయ స్పికర్,మాజీ ముఖ్యమంత్రి డోంకుపర్‌ రాయ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. కడుపుకు సంబంధిత వ్యాధితో ఈనెల 18న హరియాణాలోని గురుగ్రామ్‌లో మేదాంత ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. డోంకుపర్‌ రాయ్‌ యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (యూడీపీ) అధ్యక్షుడు. ఎన్‌పీపీ సారథ్యంలోని మేఘాలయ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌లో యూడీపీ భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోంది. కాగా ఆయన పార్థీవ దేహాన్ని రేపు మేఘాలయకు తీసుకుళ్లనున్నట్టా పార్టీ వర్గాలు తెలిపాయి.

కూటమి ఒప్పందంలో భాగంగా డోంకుపర్‌ రాయ్‌కు స్పీకర్‌ పదవి ఇచ్చారు. గతేడాది మార్చిలో ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1988 నుంచి మేఘాలయలోని షెల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తొలుత స్వతంత్రంగా పోటీ చేసిన ఆయన.. ఆ తర్వాత సొంతంగా పార్టీని స్థాపించారు. 2008 లో సీఎం ఎంపికై సంవత్సరం పాటు కొనసాగారు.అనంతరం రాష్ట్రపతి పాలన రావడంతో సీఎం కుర్చి దిగిపోయారు.

 Meghalaya Assembly Speaker Donkupar Roy died
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+