వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హింసాత్మకంగా నిరుద్యోగుల ర్యాలీ: సామాన్యులపై దాడులు, దారుణం (వీడియో)

|
Google Oneindia TeluguNews

గౌహతి: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో శుక్రవారం గిరిజన సంస్థ, నిరుద్యోగులు చేపట్టిన "పబ్లిక్ ర్యాలీ" హింసాత్మకంగా మారింది. ర్యాలీ చేపట్టిన పలువురు యువకులు సామాన్య జనంపై దాడులకు దిగారు. దీంతో అనేక మంది గాయపడ్డారు. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఖాసీ జైంతియా గారో పీపుల్ (FKJGP) రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ ర్యాలీ నిర్వహించింది.ర్యాలీలో పాల్గొన్న కొంతమంది యువత.. బాటసారులు, వాహనదారులపై దాడులకు పాల్పడ్డారు. కొందరిని వెంబడించి కొట్టారు.

Meghalaya: Shillong public rally over unemployment turns violent, many injured

ప్రజల వాహనాలు, ఎక్కువగా ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. జెండాలు పట్టుకుని, జెండాల వెదురు స్తంభాలను ఉపయోగించి ప్రజలపై దాడి చేశారు. గాయపడిన వారిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మేఘాలయలో ఇటువంటి ర్యాలీలు హింసాత్మకంగా మారిన చరిత్ర ఉంది. అయితే అధికారులు శుక్రవారం దీన్ని ఊహించలేదు. పోలీసు సిబ్బంది కంటే ర్యాలీదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో దాడులు చేస్తున్న యువకులను అడ్డుకోకుండా వీక్షకుల్లా మారిపోయారు. దీంతో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎవరినీ అరెస్టు చేశారో తెలియరాలేదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్‌ఆర్ బిష్ణోయ్, ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా మేజిస్ట్రేట్ ఇసావాండా లాలూకు చేసినా కాల్ చేసినా సమాధానం లేదు.

ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టిన్‌సాంగ్ నుంచి మాత్రమే అధికారిక స్పందన వచ్చింది. పోలీసుల నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించిందని తెలిపారు. "FKJGP లేదా ఏ సంస్థ అయినా ర్యాలీని చేపట్టవచ్చు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వారి సభ్యులను నియంత్రించడం నిర్వాహకుల కర్తవ్యం" అని ఆయన అన్నారు.

English summary
Meghalaya: Shillong public rally over unemployment turns violent, many injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X