హాట్ మోడల్ పొలిటికల్ ఎంట్రీ : అప్పట్లో అర్థనగ్న ఫోటోలతో మోడీకి..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : సినిమాలు-రాజకీయాలు ఏళ్లుగా పక్కపక్కనే ఉంటూ వస్తోన్న ఆనవాయితీ దేశంలో కొనసాగుతోంది. నటులు రాజకీయాల్లోకి రావడం.. రాజకీయ నేతలు నటుల అవతారమెత్తడం చాలా సందర్బాల్లో చోటు చేసుకున్నదే.

ఈ నేపథ్యంలోనే మరో నటి, హాట్ మోడల్ తన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసుకుంది. గత 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో.. ప్రధాని మోడీకి మద్దతుగా అర్థనగ్న ఫోటోలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నటి, మోడల్ మేఘనా పటేల్ త్వరలోనే రాజకీయ తీర్థం పుచ్చుకోబోతుంది. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో మోడీకి మద్దతునిచ్చిన ఈ మోడల్.. మహారాష్ట్రలో బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం గమనార్హం.

Meghna Patel: Model, who posed semi-nude in support of Modi, joins NCP

ఇదే విషయాన్ని ఎన్సీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా ధ్రువీకరించారు. ఈవారంలోనే వడొదరలో నిర్వహించే ఓ కార్యక్రమంలో మేఘనా పటేల్ పార్టీలో అధికారికంగా చేరుతారని ప్రకటించారు ప్రఫుల్ పటేల్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Model, actor Meghna Patel, who once posed semi-nude with a photo of Prime Minister Narendra Modi, has decided to join politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి