యాకూబ్ బర్త్ డే కేక్‌ను జైలుకు పంపించారు

నాగ్ పూర్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్ అలియాస్ యాకూబ్ మెమెన్ పుట్టిన రోజు సందర్బంగా అతని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేసిన బర్త్ డే కేక్ ను బుధవారం రాత్రి నాగపూర్ సెంట్రల్ జైలుకు పంపించారు.

యాకూబ్ మెమెన్ దగ్గర పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని జైలు అధికారులకు యాకూబ్ మెమెన్ కుటుంబ సభ్యులు మనవి చేశారు. జైలు సూపరెండెంట్ కు కేక్ అందించారు. అయితే జైలు అధికారులు ఉన్నత స్థాయి అధికారులను సంప్రదించారని తెలిసింది.

Memon's family handed over the cake to the Nagpur jail superintendent

అర్దరాత్రి 12 గంటల సమయంలో 54వ పుట్టిన రోజు జరుపుకోవాలా, ఉదయాన్నే తనను ఉరి తీస్తారు కదా అంటూ యాకూబ్ మెమెన్ ఉద్వేగానికి లోనయ్యాడని జైలు అధికారులు అంటున్నారు. అయితే బుధవారం రాత్రి జైలు అధికారులు ఇచ్చిన బోజనం చెయ్యలేదని, కేక్ కట్ చెయ్యడానికి యాకూబ్ నిరాకరించాడని సమాచారం.

అర్దరాత్రి సుప్రీం కోర్టులో విచారణ జరిగే సమయంలో యాకూబ్ మెమెన్ ఉరి శిక్ష పై స్టే విధిస్తారని అతని కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. అయితే అప్పటికే యాకూబ్ మెమెన్ తన ప్రాణాల మీద ఆశలు వదులు కున్నాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+