కారణమిదే: 2060 తర్వాత పురుషులకు పిల్లలు పుట్టరు
ఉత్తర అమెరికా, యూరప్, అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన పురుషుల్లో పునరుత్పత్తి శక్తి గణనీయంగా పడిపోయిందని ఓ నివేదిక వెల్లడించింది.
న్యూయార్క్: ఉత్తర అమెరికా, యూరప్, అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన పురుషుల్లో పునరుత్పత్తి శక్తి గణనీయంగా పడిపోయిందని ఓ నివేదిక వెల్లడించింది.
పురుషుల వీర్యం కౌంట్ వేగంగా పడిపోతోంది. 1973 నుండి 2011 సంవత్సరాల మధ్య ఈ దేశాల పురుషుల్లో వీర్యం కౌంట్ 50 నుండి 60 శాతానికి పడిపోయిందని జెరూసలెంలోని హెబ్రూ యూనివర్శిటీ నిర్వహించిన అథ్యయనంలో తేలింది.

42,935 మంది శాంపిళ్ళను అధ్యయనం చేసిన తర్వాత ఈ నివేదిక వెల్లడైంది. అయితే ఆసియా, ఆఫ్రికా , దక్షిణ అమెరికా దేశాల పురుషుల్లో వీర్యం కైౌంట్ స్థిరంగానే కొనసాగుతోందని ఆ అధ్యయనంలో తేలింది.
అయితే ఈ దేశాల పురుషుల వీర్యానికి సంబంధించిన డేటా తమ వద్ద ఎక్కువగా లేకపోవడం వల్ల కూడ తగ్గిందా లేదా అన్న అంశాన్ని అంత ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు పరిశోధకులు.
ఉత్తర అమెరికా, యూరప్, అస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో వీర్యం కౌంట్ తగ్గిన విషయాన్ని స్పష్టంగా గుర్తించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2060 నాటికి ఆ దేశాల్లోని పురుషుల్లో పునరుత్పత్తి శక్తి పూర్తిగా పడిపోతోందని పరిశోధకులు హెచ్చరించారు.
ధూమపానం, వాతావరణ కాలుష్యం కారణంగానే వీర్యం కౌంట్ పడిపోతోందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. విష రసాయనాల ప్రభావానికి గురికావడం వల్ల వీర్యం కౌంట్ పడిపోతోందని గుర్తించారు.అయితే మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని హెబ్రూ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. గతంలో అనుమానించినట్టుగా స్థూలకాయానికి వీర్యం కౌంట్ పడిపోవడానికి మాత్రం సంబంధం లేదన్నారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications