వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ని ఘోరాలు చేశారు? రాబందుల రాజకీయమా?: రాహుల్‌పై పీయూష్, స్మృతీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ఒక విద్వేష వ్యాపారి అని, ఆయన ప్రజలను విభజించే రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోవుల రక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై రాహుల్.. మోడీ సర్కారుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ఎక్కడ నేరం జరిగినా రాజకీయ ప్రయోజనాల కోసం జోక్యం చేసుకోవడాన్ని ఆపాలని రాహుల్‌కు హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే మొసలి కన్నీరు కారుస్తున్నారని గోయల్ ఆరోపించారు.

Merchant of hate: Piyush Goyal, Smriti Irani take on Rahul for attacking PM Modi

కాగా, అల్వార్ దాడిపై పార్లమెంటు సభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. దాడి జరిగిన ప్రాంతం నుంచి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఆస్పత్రి ఉన్నా బాధితుడిని తరలించేందుకు 3గంటల సమయం ఎందుకు పట్టిందో తెలపాలని రాహుల్ డిమాండ్ చేశారు.

మోడీ ప్రవచించే నవభారత్‌లో విద్వేషం రాజ్యమేలుతోందని, ప్రజల మెడలు వంచి మరణించేలా చేస్తున్నారని రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, అల్వార్ మూక దాడి ఘటనలో ఒకరు మరణించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. రాహుల్ కుటుంబమే విద్వేష రాజకీయాలకు పాల్పడిందని అన్నారు. 1984 సిక్కుల ఊచకోత, భగల్పూర్, నెల్లీ తోపాటు ఇంకా చాలా రాహుల్ కుటుంబం చేసిన ఘోరాలు ఉన్నాయని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా రాజకీయ రాంబదులా ప్రవర్తిస్తున్నారని సృతీ ఇరానీ తీవ్రంగా విమర్శించారు.

English summary
Union minister Piyush Goyal has hit out at Congress president Rahul Gandhi over the latter’s attack on Prime Minister Narendra Modi over recent incident of lynching of a Muslim man by a mob in Alwar in Rajasthan. Hitting back at the Gandhi scion on microblogging site Twitter, the minister referred to him as a “merchant of hate”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X