భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం !
మెక్సికో/అమెరికా: ప్రపంచంలో కొందరు వ్యక్తులు చేస్తున్న పనులకు ప్రజలు హడలిపోతన్నారు. చెత్త మూడ్‌లో మానసికంగా సహనం నసించిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అడ్డమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మనం నిత్యం వింటున్నాము. ఆ విధంగా మెక్సికోలో ఒక సైకో తాను సైతాన్ ఆరాధకుడనని చెప్పుకుని అతని భార్యను దారుణంగా చంపేసి నరమాంస భక్షకుడిగా మారి అతని భార్య మాంసాన్ని తినడం కలకలం రేపింది.
అల్వారో( 32) అనే వ్యక్తి మెక్సికోలోని ప్యూబ్లాకు చెందినవాడు. అల్వారో, మారియా అనే మహిళ గతేడాది పెళ్లి చేసుకున్నారు. మారియాకు ఇంతకు ముందే ముగ్గురితో పెళ్లి జరగడంతో ఐదు మంది పిల్లలు ఉన్నారు. తరువాత మారియాను అల్వారో పెళ్లి చేసుకున్నాడు. పిల్లల తల్లి మారియాను పెళ్లి చేసుకున్న అల్వారో మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. పెళ్లయి ఏడాది కూడా కాకముందే భార్య మారియాను కొట్టి వేధిస్తున్న అల్వారో శాడిస్టులాగా తయారైనాడు.

మారియా మొదటి భర్తలకు పుట్టి వయసుకు వచ్చిన కుమార్తెలను అల్వెరో లైంగికంగా వేధించాడాని తెలిసింది. అతని చర్యలను తట్టుకోలేక మారియా వయసుకు వచ్చిన ఆమె ఇద్దరు కుమార్తెలను అమ్మమ్మ ఇంట్లో పెట్టింది. జూన్ 29న అల్వారో దారుణానికి పాల్పడ్డాడు. అల్వారో అతని భార్య మారియాను హతమార్చి ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో ఉంచాడు.

మారియా మెదడును మానవ మాంసంగా తిన్నాడు. అతను తన భార్య పుర్రెను సిగరెట్ యాష్ ట్రేగా కూడా ఉపయోగించాడని వెలుగు చూసింది. భార్య మారియాను దారుణంగా హత్య చేసిన కొన్నిరోజుల తర్వాత మరియా కుమార్తెకు ఫోన్ చేసి మీ మమ్మీని హత్య చేశానని ఒప్పుకున్నాడు. మారియా కుమార్తె సమాచారం ఇవ్వడంతో పోలీసులు అల్వారోను అదుపులోకి తీసుకున్నారు. సైతాన్ ఆజ్ఞను అంగీకరించి ఈ హత్య చేశానని అల్వారో అంగీకరించాడని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications