జయ మేనకోడలు దీపా ఫ్యామిలీలో చిచ్చు: భర్తను బయటపెట్టి డోర్ లాక్ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఫ్యామిలీలో మళ్లీ గొడవలు మొదలైనాయని వెలుగు చూసింది. దీపా భర్త మాధవన్ ఇంటి దగ్గరకు వచ్చినా కనీసం ఆయన లోపలికి వెళ్లకుండా బయట నుంచి అటే వెళ్లిపోయారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడటానికి దీపా తన ఇంటిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీ నుంచి పోటీ చేస్తున్న దీపా ఎలా స్పంధిస్తారో అంటూ మీడియా ఆమె ఇంటి దగ్గరకు వెళ్లింది.

దినకరన్ ఓటర్లకు డబ్బులు పంచారు
దీపా మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా డబ్బు పంపిణి చేసి ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నించారని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ విరుచుకుపడ్డారు.

ప్రభుత్వానికి సిగ్గు ఉంటే క్లీన్ చిట్ తెచ్చుకోవాలి
తమిళనాడులో అధికారంలో ఉన్న శశికళ వర్గంలోని ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకుని ఎన్నికల కమిషన్, ఐటీ అధికారుల దగ్గర క్లీన్ చిట్ తెచ్చుకోవాలని సవాలు విసిరారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా నేనే విజయం సాధిస్తానని దీపా జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు.

వచ్చారు, వెళ్లారు
అదే సమయంలో దీపా భర్త మాధవన్ కారులో ఇంటి ముందుకు వచ్చారు. దీపా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన బయటే ఉండిపోయారు. అయితే మీడియా సమావేశం పూర్తి అయిన తరువాత మాధవన్ కు చేదు అనుభవం ఎదురైయ్యింది.

ఇంటి డోర్ లాక్ చేసి
మీడియా సభ్యులు బయటకు వెళ్లిన తరువాత దీపా ఇంటి తలుపులు అన్ని లాక్ చేసుకుని లోపలికి వెళ్లిపోయారు. చేసేది ఏమీ లేక ఆమె భర్త మాధవన్ అక్కడి నుంచి కారులో వెనుతిరిగి వెళ్లిపోయారు.

కొత్త పార్టీ తెచ్చిన చిక్కులు
దీపాకు వ్యతిరేకంగా ఆమె భర్త మాధవన్ ఇటీవల మాట్లాడారు. దీపా సమాజసేవ కోసం ఎంజీర్ అమ్మ దీపా పేరవై సంస్థ పెట్టారని, అయితే తాను త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతున్నానని మాధవన్ జయలలిత సమాధి దగ్గర మీడియాకు చెప్పారు. ఆ రోజు నుంచి దీపా, మాధవన్ మద్య విభేదాలు తలెత్తాయని సమాచారం.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications