రాజకీయాల్లోకి: నోకామెంట్ అంటున్న రజనీకాంత్, ఎంజీఆర్ గ్రేట్: జయ పేరు!

Recommended Video

    Rajinikanth political entry : రాజకీయాల్లోకి నో 'కామెంట్' అంటున్న రజనీకాంత్

    చెన్నై: ప్రతి మనిషిలోని మంచిగుణాలే ఇతరుల వద్ద వారి విలువను పెంచుతాయని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నారు. సమయం, సందర్బం వచ్చినపుడు సినిమాలు, రాజకీయాలు తనంతకు తానుగా మారిపోతాయని రజనీకాంత్ జోస్యం చెప్పారు.

    ఇంటి దగ్గర

    ఇంటి దగ్గర

    అభిమానులతో ఐదోరోజు సమావేశాలను శనివారం రజనీకాంత్ నిర్వహించారు. పోయెస్ గార్డెన్ లోని ఇంటి దగ్గర రజనీకాంత్ ను ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా తమిళనాడులో రాజకీయాలు సాధ్యం అవుతాయా అని మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అన్నారు.

    ఎంజీఆర్, శివాజీ గణేశన్

    ఎంజీఆర్, శివాజీ గణేశన్

    తమిళ సీనీరంగంలో ఒక వెలుగు వెలిగిన అలనాటి ప్రముఖ నటుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), శివాజీ గణేశన్‌ ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని రజనీకాంత్ గుర్తు చేశారు.

    సీఎం అయ్యారు కదా

    సీఎం అయ్యారు కదా

    రెండు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంజీ రామచంద్రన్, సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శివాజీ గణేశన్ లోని గుణగణాలే తమిళ ప్రజల హృదయాల్లో శాస్వతంగా నిలిచిపోవడానికి కారణమని రజనీకాంత్ గుర్తు చేశారు.

    శివాజీ గణేశన్

    శివాజీ గణేశన్

    తాను నటుడిగా ఎదిగే సమయంలో శివాజీ గణేశన్‌ తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పిన రజనీకాంత్ ఇదే సందర్బంలో ఆ అనుభవాలను అభిమానులకు వివరించారు. సినీరంగంలో ఉంటూనే ఎంజీఆర్, శివాజీ గణేశన్ తమిళనాడులో ప్రజాసేవ చేశారని ఇదే సందర్బంలో రజనీకాంత్ చెప్పారు.

    జయలలిత పేరు మాత్రం

    జయలలిత పేరు మాత్రం


    అభిమానులతో గత ఐదు రోజుల నుంచి వరుసగా భేటీ అయ్యి వారితో ఫోటోలు తీసుకుంటున్న రజనీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడిన సమయంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ పేర్లు మాత్రమే చెప్పారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరును ఎక్కడా ప్రస్తావించకుండా రజనీకాంత్ జాగ్రత పడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+