ఎంహెచ్ 370 మిస్టరీయే: వెతికేందుకు ఏడాది పట్టొచ్చు
కౌలాలంపూర్: గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 మిస్టరీ అంశంపై చర్చించేందుకు ఆస్ట్రేలియా, మలేషియా, చైనాలు భేటీ కానున్నాయి. ఈ దేశాల అధికారులు కాన్‌బెర్రాలో వచ్చే వారం భేటీ కానున్నారు. ఏం చేయాలో ఈ భేటీలో వారు చర్చించి, ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం చెప్పారు.
ఆస్ట్రేలియన్ సెర్చ్ కో ఆర్డినేటర్ ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) మాట్లాడుతూ... మలేషియా విమానాన్ని వెతికేందుకు ఎనిమిది నుండి పన్నెండు నెలల వరకు పట్టవచ్చునని తెలిపారు. విమానం కోసం తాము విస్తృత గాలింపు చర్యలు చేపట్టామన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని తాము కుటుంబ సభ్యులకు తెలియజేస్తామన్నారు.

వచ్చే వారం నిర్వహించనున్న సమావేశం చాలా కీలకమైందని అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో విమానం సెర్చింగ్ ఆపరేషన్ పైన పూర్తిగా చర్చిస్తామంటున్నారు.
కాగా, రోబోటిక్ మినీ సబ్ మెరైన్ ఒకటి హిందూ మహాసముద్రంలో పూర్తిగా జల్లెడ పడుతోంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి శిథిలాలను గుర్తించలేదు. మలేషియా రవాణా శాఖ మంత్రి హిషముద్దీన్ హుస్సేన్ మాట్లాడుతూ... తాము విమానం అచూకీని తప్పనిసరిగా కనుగొంటామని చెప్పారు. తాము సాధ్యమైనంత త్వరగా ఆచూకీ తెలుసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications