అపురూపంగా దాచుకున్న కానుక అదే: సత్య నాదెళ్ల
ముంబై: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సంతకం చేసి ఇచ్చిన బ్యాట్‌ను అపురూపంగా దాచుకున్నానని మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. సాప్ట్‌వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, సాంకేతిక విప్లవాన్ని ప్రజలకు చేరువు చేసిన ఘనత మైక్రోసాప్ట్‌దే.
అలాంటి మైక్రోసాప్ట్ సంస్థకు ఇప్పుడు మన తెలుగుతేజం సత్యనాదెళ్ల నాయకత్వంలో ముందుకుసాగుతోంది. 'మైక్రోసాఫ్ట్' సీఈవోగా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సాధించిన సత్య నాదెళ్లకు సంబంధించి అభిరుచులు గురించి రెండు నిమిషాలకుపైగా నిడివి ఉన్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ఆ వీడియోలో సత్య నాదెళ్ల చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు పాఠకుల కోసం:
మీపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరు?
మా తల్లిదండ్రులు.. మా నాన్న ఆర్థికవేత్త, లెఫ్టిస్ట్,మార్క్సిస్టు కూడా. మా అమ్మ సంస్కృత ప్రొఫెసర్. వాళ్ల అభిప్రాయాల్లో పెద్దగా ఏకీభావం ఉండేది కాదు. అదే నాకు సొంత దృక్పథాన్ని ఏర్పరుచుకునేందుకు వీలు కల్పించింది. వాళ్లు గొప్ప విలువలు పాటించారు. అవి నాకెంతగానో ఉపయోగపడ్డాయి.
మీరు త్వరగా నిద్ర లేస్తారా? లేక రాత్రుళ్లు మేల్కుంటారా?
పొద్దున్నే లేస్తాను..
కాఫీ తాగుతారా? లేక 'టీ'నా?
ఉదయాన్నే కాఫీ, మధ్యాహ్నం టీ తాగుతాను..
పొద్దున్న లేవగానే మీరు చేసే పని ఏంటిది?
రన్నింగ్ షూస్ వేసుకోవడం
కామిక్ సాన్స్ ఫాంట్ మంచిదా లేక చెడ్డదా?
మంచి ఫాంటే
మీ వర్క్ డేలో మీ ఫేవరెట్ టైం వేస్టర్ ఏమిటి?
కొటారా జోక్స్
మీరు అత్యంత అపురూపంగా భావించే వస్తువేంటిది?
సచిన టెండూల్కర్ సంతకం చేసి ఇచ్చిన క్రికెట్ బ్యాట్
స్టీవ్ బాల్మెర్‌తో క్లిప్పర్స్ గేమ్ ఆడటం ఇష్టమా లేక బిల్ గేట్స్ తో బ్రిడ్జ్ గేమ్ ఆడటమా?
(నవ్వుతూ) స్టీవ్ బాల్మర్‌తో క్లిప్పర్స్ గేమ్ ఆడటమే ఇష్టమనుకుంటా..
ఒక సమావేశాన్ని మీరు ఎలా నిర్వహిస్తారు?
ఎక్కువ విను. తక్కువ మాట్లాడు. సమయమొచ్చిన నిర్ణయాత్మకంగా వ్యవహరించు..
కొత్తగా నియమించుకునేవారిలో మీరు కోరుకునే లక్షణం..
స్పష్టత, ఎనర్జీ (ఉత్సాహం)
మీరు అమెరికాలో ఎవరికైనా క్రికెట్ రూల్స్ వివరించాల్సి వస్తే.. ఏ విషయాన్ని చెప్తారు?
(నవ్వుతూ) ఇట్స్ ఇంపాజిబుల్












Click it and Unblock the Notifications