Delhi Polls: ఢిల్లీ ఎన్నికల్ల అసలు ఓటర్లు వారే-ఆప్, బీజేపీ ఫోకస్ అందుకే..!
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న జరిగే ఎన్నికలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు విపక్ష బీజేపీకి కూడా కీలకంగా మారాయి. వరుసగా మూడుసార్లు అధికారం అనుభవించిన ఆప్.. మరోసారి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటే.. కేంద్రంలో వరుసగా మూడుసార్లు గెలిచినా హస్తినలో అధికారం అందని ద్రాక్షగా మారడంతో బీజేపీ కూడా పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా ఓ వర్గం ఓటర్లపై గట్టిగా గురిపెట్టాయి.
ఢిల్లీలో మధ్యతరగతి ఓటర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ రెండూ వారిపైనే ఫోకస్ పెట్టి హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, ఆప్ విడుదల చేసిన మ్యానిఫెస్టోల్లో పేదలతో పాటు మధ్యతరగతినే టార్గెట్ చేశాయి. ఇవాళ ప్రత్యేకంగా మధ్యతరగతి ఫోకస్ గా మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సెవెన్ పాయింట్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇందులో కేంద్రం ట్యాక్స్ టెర్రరిజం నుంచి ఢిల్లీ ప్రజల్ని కాపడతామని ఆయన హామీ ఇచ్చారు.

ఇలా కేజ్రివాల్ సెవెంట్ పాయింట్ మ్యానిఫెస్టో విడుదల చేశారో లేదో అదే మధ్యతరగతి టార్గెట్ గా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలతో మేరా బూత్-సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ.. విద్య నుంచి వైద్యం వరకూ ప్రతీ ఆధునిక సదుపాయాన్ని ఢిల్లీకి కల్పిస్తోందన్నారు. కానీ అదే విద్య, వైద్యం పేరుతో ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. ప్రధాని వ్యాఖ్యల వెనుక కేజ్రివాల్ తాజాగా విద్య, వైద్యంపై చేసిన డిమాండ్లు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ లో విద్య, వైద్యానికి 10 శాతం కేటాయింపులు చేయాలని కేజ్రివాల్ తాజాగా కోరారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని, ఉన్నత విద్యలో స్కాలర్ షిప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి మోడీ ఇవాళ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications