మినీ స్కర్స్ట్‌లు బత్కల్‌ను రెచ్చగొట్టాయి: పోలీసులు

యాసిన్ భత్కల్, అతని అనుచరుడు అసదుల్లా అక్తర్‌లపై పోలీసులు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పొట్టి దుస్తులు ధరించిన మహిళలు మసీదులోకి ప్రవేశించడం ఇస్లామ్‌కు విరుద్ధమని వారు భావించారని, దాంతో మసీదు మూడో గేటు వద్ద వారు దాడికి దిగారని పోలీసులు ఆ చార్జిషీట్‌లో తెలిపారు.
విదేశీయులు మూడో గేటు వద్ద ఎక్కువగా కనిపిస్తుండడంతో అది దాడికి తగిన స్థలమని అనుకుని రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. 2010 సెప్టెంబర్ 19వ తేదీన భత్కల్, అక్తర్ జామా మసీదు మూడో గేటు వద్ద దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో ఇద్దరు తైవానీయులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు.
ఇద్దరు బైక్‌పై వచ్చి జమామసీదు మూడో గేటు వద్ద యాత్రికులపై కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన తెచ్చిన కారులో అమర్చిన బాంబు పేలి చిన్నపాటి పేలుడు సంభవించింది.












Click it and Unblock the Notifications