విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వ మంత్రి ఆధవ్ అర్జున.. విడాకులు తీసుకున్నారు. విజయ్ కేబినెట్ లో పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారాయన. తన భార్య డైసీ మార్టిన్ తో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 14 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన వీరి వైవాహిక బంధానికి తెరపడినట్టయింది.

దీనిపై డైసీ మార్టిన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. తాము విడిపోయినప్పటికీ.. ఒకరిపట్ల ఒకరికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. 14 సంవత్సరాలుగా స్నేహితులుగా, జీవిత భాగస్వామ్యులుగా, తల్లిదండ్రులుగా కలిసి సాగించిన ప్రయాణంలో ఎంతో ప్రేమ, అవగాహన, ఎత్తుపల్లాలను చూశామని ఆమె పేర్కొన్నారు.

Minister Aadhav Arjuna and his wife Daisy Martin have reportedly parted ways after 14 years of marriage

వైవాహిక జీవితంలో విడిపోయి వేర్వేరు దారుల్లో పయనించాలని నిర్ణయించుకున్నామని, దీని వెనుక ఎవరి ప్రమేయం లేదని, కుటుంబ పరిస్థితులు కూడా కారణం కాదని అన్నారు. తమ పిల్లల భవిష్యత్తు, సంక్షేమం, సంతోషమే తమకు అత్యంత ప్రాధాన్యత అని డైసీ మార్టిన్ వెల్లడించారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

అధవ్ అర్జున ఒక్కడే కాదు- అత్త, బావమరిది కూడా
అధవ్ అర్జున ఒక్కడే కాదు- అత్త, బావమరిది కూడా

వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఆధవ్ అర్జున్ పట్ల తనకు ఎప్పటికీ గౌరవం తగ్గదని, అది చిరస్మరణీయంగా నిలిచి పోతుందని డైసీ అన్నారు. ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలోనూ సంతోషం, మనశ్శాంతి, విజయం లభించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. ఈ సమయంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని, కుటుంబానికి అవసరమైన ప్రైవసీని ఇవ్వాలని, అభిమానులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలని ఆమె కోరారు.

జాక్‌పాట్ కొట్టిన జై షా: ఏకగ్రీవ ఎన్నిక
జాక్‌పాట్ కొట్టిన జై షా: ఏకగ్రీవ ఎన్నిక

ఆధవ్ అర్జున.. అధికార టీవీకేలో నంబర్ 2 గా వ్యవహరిస్తోన్నారు. విజయ్ కు కుడిభుజంగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఏడాది మే లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విల్లివాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. 2012 నవంబర్ లో ఆయన డైసీ మార్టిన్ ను వివాహం చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త లాటరీ కింగ్ గా ప్రసిద్ధి చెందిన శాంటియాగో మార్టిన్ కుమార్తె ఆమె. ప్రస్తుతం ఏరీస్ ఇన్‌వెస్ట్‌మెంట్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సీఎం వీడీ సతీషన్ సింప్లిసిటీకి ఫిదా
సీఎం వీడీ సతీషన్ సింప్లిసిటీకి ఫిదా

వైవాహిక జీవితం, అర్జున రాజకీయ ప్రయాణంపై గతంలో కూడా అనేక వార్తలు వచ్చాయి. 2025 ఫిబ్రవరిలో డైసీ మార్టిన్ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితానికి, ఆధవ్ అర్జున రాజకీయ నిర్ణయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అప్పట్లో పేర్కొన్నారు. అర్జున తన రాజకీయ నిర్ణయాలను స్వతంత్రంగానే తీసుకుంటారని, అందులో తమ జోక్యం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు.

మార్టిన్ కుటుంబం ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు వీరి కుటుంబ వాతావరణంపై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ఒకవైపు ఆధవ్ అర్జున.. టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతోండగా.. ఆయన అత్తగారు అంటే డైసీ తల్లి లీమా రోజ్ మార్టిన్.. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కుటుంబంలో ఉన్న రాజకీయ వైరుధ్యాలు ఇదివరకే బహిర్గతం అయ్యాయి కూడా. ఈ ఏడాది మే లో అర్జున బావమరిది జోస్ చార్లెస్ మార్టిన్ ఆయనపై బహిరంగ ఆరోపణలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+