I Love Mumbai:ఏం జరిగినా సరే, డీకే శివకుమార్ పట్టు, మా ఫ్రెండ్ కాదు, రెబల్స్ !

ముంబై: వచ్చిన పని పూర్తి చేసుకునే వరకూ తాను ముంబై నుండి బెంగళూరు వెళ్లనని కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అంటున్నారు. ముంబైలోని స్టార్ హోటల్ ముందు రైడు మీద మకాం వేసిన మంత్రి డీకే. శివకుర్ ఐ లవ్ ముంబై, ఐ లవ్ హోటల్, తనకు వేరే హోటల్స్ ఉన్నాయని చెప్పారు. అయితే డీకే శివకుమార్ మా ఫ్రెండ్ కాదని, ఆయన్ను తాము కలవలేమని రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.

ముంబైలోని రినైసాన్స్ హోటల్ లో కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేశారు. రెబల్ ఎమ్మెల్యేను బుజ్జగించడానికి ముంబై చేరుకున్న మంత్రి డీకే శివకుమార్ రినైసాన్స్ హోటల్ లోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో హోటల్ ముందు మకాం వేశారు.

Minister DK Shivakumar now is in Mumbai to bring back dissident MLAs of Karnataka.

డీకే. శివకుమార్ ను కలవడం తమకు ఇష్టం లేదని, ఆయనతో తమ స్నేహం సంవత్సరం క్రితమే బెడిసికొట్టిందని రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి తదితరులు అన్నారు. రమేష్ జారకి హోళి కాకుంటే మరో 10 మంది ఎమ్మెల్యేలు హోటల్ లో ఉన్నారని, వారితో భేటీ అవుతానని మంత్రి డీకే. శివకుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

తనలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి హోటల్ మేనేజ్ మెంట్ గర్వపడాలని, కాని తన రూం క్యాన్సిల్ చేశారని డీకే శివకుమార్ వ్యంగంగా అన్నారు. ఐ లవ్ ముంబై, ఐ లవ్ హోటల్, తనకు వేరే హోటల్స్ ఉన్నాయని డీకే. శివకుమార్ చెప్పారు. తనకు రెబల్ ఎమ్మెల్యేలు చాల ఆప్తులని డీకే. శివకుమార్ అన్నారు.

హోటల్ లో బస చేసిన ఎమ్మెల్యేలతో భేటీ కాకుండా తాను ఇక్కడి నుంచి వెళ్లనని డీకే శివకుమార్ అంటున్నారు. రోడ్డు మీద మకాం వేసిన మంత్రి డీకే శివకుమార్ అక్కడే కాఫీలు తాగి భోజనం చేశారు. డీకే. శివకుమార్ తో పాటు ఎమ్మెల్యేలు జీటీ. దేవేగౌడ, బాలక్రిష్ణ, శివమారమేగౌడ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+