కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకి తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మరో భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే తిప్పిన పైలట్ కష్టమ్మీద కిందకు దించాడు.
తామంతా సురక్షితంగానే ఉన్నామని ఆ తర్వాత కిరణ్ రిజిజు తెలిపారు. మాలా రాజ్యలక్ష్మి షా అనే ఎంపీ కూడా రిజిజుతో పాటు ఉన్నారు. వారిద్దరినీ ఆ తర్వాత ఎంఐ-17వి5 హెలికాప్టర్‌లో తరలించారు.

హెలికాప్టర్ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య వచ్చే సమయానికి హెలికాప్టర్‌లో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్లలో హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఇద్దరు టీవీ జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇంజిన్‌లో సమస్య వచ్చినట్లు గుర్తించిన పైలట్, సుమారు 20 నిమిషాల తర్వాత దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.












Click it and Unblock the Notifications