కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు: మహిళా మంత్రికి గాయాలు: ఆసుపత్రిలో అడ్మిట్

Minister Lakshmi Hebbalkar: కర్ణాటకలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అదే కారులో ప్రయాణిస్తోన్న ఆమె సోదరుడు, కాంగ్రెస్ శాసన మండలి సభ్యుడు చెన్నరాజుకూ గాయాలయ్యాయి.

ఈ తెల్లవారు జామున కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ ఘటన సంభవించింది. సోమవారం బెంగళూరులో కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశానికి హాజరయ్యారు లక్ష్మీ హెబ్బాల్కర్. ఆమె సొంత నియోజకవర్గం బెళగావి రూరల్. సంక్రాంతి పండగ వేడుకలను దృష్టిలో పెట్టుకుని, సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజుతో కలిసి రాత్రి కారులో బెళగావికి బయలుదేరారు.

Minister Lakshmi Hebbalkar injured and admitted in Belagavi hospital

మార్గమధ్యలో కారు ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో జిల్లాలోని కిత్తూరు తాలూకా పరిధిలోని అంబద్‌గట్టి వద్ద కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బలంగా చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మీ హెబ్బాల్కర్‌, చెన్నరాజుకు గాయాలయ్యాయి.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీ హెబ్బాల్కర్ ముఖం, ఛాతీపై గాయాలయ్యాయని డాక్టర్లు వెల్లడించారు. చెన్నరాజుకు తలకు గాయమైందని తెలిపారు. అనూహ్యంగా కారుకు అడ్డుగా వచ్చిన ఓ కుక్కను తప్పించే క్రమంలో డ్రైవర్ అదుపు తప్పినట్లు పోలీసులు చెప్పారు.

లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు మృదుల్ హెబ్బాల్కర్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి, మామను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య చికిత్సల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై ఆరా తీశారు. తన తల్లి స్వల్పంగా గాయాలయ్యాయని, త్వరలోనే కోలుకుంటారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+