టోల్ ట్యాక్స్ కట్టమంటే మంత్రి తనయుడి జులుం, అరెస్ట్

టోల్ బూత్ సిబ్బంది గోవా పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల మేరకు.. నితేష్ తన స్నేహితులతో కలిసి మూడు కార్లలో గోవా వెళ్తున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో గల పెర్నెం తాలుకోలోని ధర్గాలిమ్ వద్ద టోల్ సిబ్బంది వారిని రుసుము చెల్లించమని అడిగారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్ గేటు సిబ్బంది ఒక్కో వాహనానికి రూ.250 చెల్లించాలని కోరారు. దీంతో ఆగ్రహం వచ్చిన నితేష్ రానే తన స్నేహితులతో కలిసి టోల్ బూత్‌లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నితేష్‌తో పాటు పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంత్రి తనయుడు అరెస్టు వార్త తెలియడంతో అనుచరులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో వారిని మరో స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications