మైనర్ బాలుడిపై రెండేళ్లుగా అత్యాచారం.. 16 మంది నిందితులు !!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో చోటు చేసుకున్న భయంకర ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పదహారేళ్ల బాలుడుని గత రెండు సంవత్సరాలుగా ఆత్యాచారం చేస్తున్న ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక రాజకీయ నేతలు కూడా ఉన్నారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది.
గ్రిండర్ యాప్‌తో పరిచయం..
2023లో బాలుడు "ఎల్‌జీబీటీక్యూ" డేటింగ్ యాప్ "గ్రిండర్"లో అకౌంట్ తెరిచాడు. ఆ సమయంలో అతనికి 23 ఏళ్ల మహమ్మద్ అఫ్సల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మొదట స్నేహంగా మొదలైన వాటి సంబంధం.. ఆ తర్వాత మరింత దగ్గరైంది. ఆ పరిచయం కాలక్రమంలో బాలుడి జీవితాన్ని దారుణంగా మార్చేసింది. అఫ్సల్ తన పరిచయం ద్వారా బాలుడిని బయటికి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే కాసరగోడ్, కోజికోడ్, కన్నూర్, ఎర్నాకులం జిల్లాలలో అతన్ని తిప్పుతూ, బలవంతంగా లైంగిక దాడులకు గురి చేశాడు. ఈ సమయంలో మరో 15 మంది వ్యక్తులు కూడా ఈ అమానుష కృత్యాలలో పాలుపంచుకున్నట్లు బయటపడింది.
అయితే బాలుడి ఇంటికి తరచుగా పెద్ద వయసువారు వస్తుండటం తల్లికి అనుమానం కలిగించింది. ఎట్టకేలకు ధైర్యం చేసి, సెప్టెంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే చైల్డ్‌లైన్ కౌన్సెలింగ్ కు బాలుడుని పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2023 నుంచి 2025 వరకు తనపై జరిగిన అఘాయిత్యాలన్నీ ఓపెన్ అయ్యాడు బాలుడు.
16 కేసులు.. 12 అరెస్టులు
ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు నాలుగు జిల్లాలలో పోక్సో చట్టం కింద 16 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 12 మంది నిందితులు అరెస్టు కాగా, మిగతా నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుల వయసు 30 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. "బాధితుడు మైనర్ అని తెలిసి కూడా పెద్దవారు అఘాయిత్యాలకు పాల్పడటం మానవత్వానికి మచ్చ" అని పిల్లల హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న తరుణంలో ఇందులో మరిన్ని కీలక వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన వెనుక స్థానిక మాఫియా లేదా గ్యాంగ్ కార్యకలాపాలు ఉన్నాయా? అన్న దానిపై కూడా దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు చిన్నారులపై ఆన్‌లైన్ యాప్‌ల ప్రభావాన్ని తల్లిదండ్రులు క్రమం తప్పకుండా గమనించాలని.. ఇంటికి అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలపై పర్యవేక్షణ అవసరమని చెబుతున్నారు. పిల్లలు ఒంటరిగా ఎదుర్కొనే సమస్యలను పంచుకునేలా నమ్మకం కలిగించే వాతావరణం సృష్టించాలని సూచిస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications