అమ్మాయి అర్ధరాత్రి ట్విస్ట్.. ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది...

సాయంత్రం పూట ఇంటి నుంచి బయటకెళ్లిన ఓ అమ్మాయి అర్ధరాత్రికి ఇంటికి తిరిగొచ్చింది. అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో... ఏమైందోనని టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరైన ఆ కుటుంబం ఎట్టకేలకు ఆమె ప్రత్యక్షమవడంతో ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాక్‌కి గురైంది. తనపై 'గ్యాంగ్ రేప్' జరిగిందని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులకు గుండె ఆగిపోయినంత పనైంది. కానీ అసలు నిజం ఆ తర్వాత బయటపడింది... ఇంతకీ ఏంటా నిజం....

ఇదీ జరిగింది...

ఇదీ జరిగింది...

ఛత్తీస్‌గఢ్‌ కవార్దా జిల్లాకు చెందిన ఓ గిరిజన బాలిక(14) ఆదివారం(నవంబర్ 22) సాయంత్రం తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి 11.30గం. అవుతున్నా అమ్మాయి ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆ కుటుంబం కంగారుపడింది. అప్పటికే చాలా చోట్ల ఆమె కోసం వెతికిన కుటుంబం... ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ అర్ధరాత్రి సమయంలో ఎట్టకేలకు ఆమె ఇంటికి వచ్చింది. దీంతో అప్పటిదాకా టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరైన ఆ కుటుంబం ఆమెను చూసి ఊపిరి పీల్చుకుంది.

బాంబు లాంటి వార్త...

బాంబు లాంటి వార్త...

ఎట్టకేలకు తమ బిడ్డ ఇంటికి చేరిందని ఆ తల్లిదండ్రులు టెన్షన్ నుంచి బయటపడుతున్న సమయంలో.. ఆమె ఓ బాంబు లాంటి వార్త చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకెళ్లిన సమయంలో... నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే రెండు,మూడు రోజులు విచారణ జరిపినా పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో ఆ బాలిక చెప్తున్నది అసలు నిజమేనా కాదా అన్న అనుమానం వచ్చింది.

Recommended Video

    హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
    ఎట్టకేలకు బయటపడ్డ నిజం...

    ఎట్టకేలకు బయటపడ్డ నిజం...

    సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ఆ బాలికను,ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను.. వారు చెప్పిన సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా ఇద్దరు పొంతన లేని విషయాలు చెప్పారు. దీంతో పోలీసులు కాస్త గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజం బయటపడింది. పీజీ కాలేజీ గ్రౌండ్‌లో తామిద్దరం కలుసుకున్నామని... ఆ సమయంలో సమయాన్ని మరిచిపోయామని చెప్పారు. తీరా సమయం చూసేసరికి అప్పటికే ఆలస్యమైందని... ఆ సమయంలో ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు తిడుతారని 'గ్యాంగ్ రేప్' కథ అల్లినట్లు చెప్పారు. దీంతో పోలీసులు,ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. బాలిక బాయ్‌ఫ్రెండే గ్యాంగ్ రేప్ కథ అల్లమని ఆమెకు చెప్పినట్లు పోలీసులు నిర్దారించారు. మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+