బాలికపై గ్యాంగ్ రేప్: ఆడపిల్ల పుట్టిందని సూసైడ్

పోలీసుల కథనం ప్రకారం... ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 20న అదృశ్యమైన బాధిత బాలిక నాలుగు రోజుల తర్వాత మంగళవారం రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన ఘటనకు గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు తమను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు.
అత్యాచారం విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని నిందితులు బెదిరించినట్లు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు నిందితులను అరెస్ట్ చేశారు.
ఆడపిల్ల పుట్టిందని ఆత్మహత్య
హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో మళ్లీ ఆడపిల్ల పుట్టిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచికచర్ల మండలంలోని పరిటాలకు చెందిన సద్దాం హుస్సేన్ దంపతులకు రెండు నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. తనకు మళ్లీ ఆడ పిల్ల పుట్టిందని మనస్తాపానికి గురైన హుస్సేన్ బుధవారం తెల్లవారుజామున కంచికచర్ల సమీపంలోని పంట పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో సంతానమూ ఆడపిల్ల కావడంతో మనస్తాపానికి గురైన హుస్సేన్ నవంబర్ నెలలో కూడా రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించాడు.












Click it and Unblock the Notifications