ఎత్తుకెళ్లి అమ్మాయిపై నలుగురు గ్యాంగ్ రేప్: ఇద్దరి పట్టివేత

రాయపూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు బుధవారంనాడు చెప్పారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు

మల్కీత్ సింగ్ (24), రవి చౌహాన్ (19) అనే ఇద్దరు యువకులను మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భిలాయ్ ప్రాంతంలోని సుపేలా పోలీసు స్టేషన్ పరిధిలో గల కోహ్కాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు

 Minor girl kidnapped, gang-raped in Chhattisgarh; 2 held

మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సమీపంలోని దుకాణం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నలుగురు నిందితులు మోటార్ బైక్‌లపై వచ్చి ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు.

వారు ఆమెను సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి మల్కీత్, రవి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఇంటికి చేరుకున్న తర్వాత తల్లి ఆ బాలిక విషయాన్నంతా చెప్పింది. అయితే, ఆ సమయంలో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు.

నాలుగు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చింది. ఫిర్యాదును ఆధారం చేసుకుని పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+