• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాలేజ్ అమ్మాయి బర్త్ డే పార్టీ, స్నేహితుడిని చితకబాది ఆరు మంది గ్యాంగ్ రేప్, వీడియోలు తీసి !

|

చెన్నౌ/కోయంబత్తూరు: కాలేజ్ విద్యార్థినిపై ఆమె బర్త్ డే రోజు సామూహిక అత్యాచారం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు నలుగురు కామాంధులను అరెస్టు చేశారు. కాలేజ్ అమ్మాయి స్నేహితుడిని చితకబాది అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు మొబైల్ లో వీడియోలు తీసి చిత్రహింసలు పెట్టారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ పెక్టర్ ప్రభాదేవి మీడియాకు చెప్పారు. పోలీసుల కథనం మేరకు కాలేజ్ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసిన కేసు వివరాలు ఈ విదంగా ఉన్నాయి.

పరిచయమైన 24 గంటల్లో యువతి వలలో ఎమ్మెల్యే, ఆ పనైపోయింది, సెక్స్ వీడియోలతో ఫినిష్ !

 కాలేజ్ అమ్మాయి బర్త్ డే

కాలేజ్ అమ్మాయి బర్త్ డే

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సీరనాయకన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్నది. గత నెల నవంబర్ 26వ తేదీన కాలేజ్ అమ్మాయి బర్త్ డే. ఆ రోజు స్నేహితుడితో కలిసి సిరినాయకన్ లోని పార్క్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించుకోవడానికి కాలేజ్ విద్యార్థిని వెళ్లింది.

అమ్మాయిపై కామాంధుల కన్ను

అమ్మాయిపై కామాంధుల కన్ను

రాత్రి 9 గంటల సమయంలో బర్త్ డే పార్టీ వేడుకలు ముగించుకున్న కాలేజ్ అమ్మాయి స్నేహితుడితో కలిసి పార్క్ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో ఆరు మంది కామాంధులు కాలేజ్ అమ్మాయి మీద కన్ను వేశారు. పార్క్ లో కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడికి కనపడకుండా వారిని నిందితులు వెంబడించారు.

 అమ్మాయి స్నేహితుడిపై దాడి

అమ్మాయి స్నేహితుడిపై దాడి

పార్క్ లో ఒక్కసారిగా కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడిని కామాంధులు చుట్టుముట్టారు. ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత రాత్రి వరకు ఉన్నారు అంటూ ఇద్దరితో నిందితులు గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో అటువైపు ఎవ్వరూ రాకుండా ఇద్దరు కాపాల ఉన్నారు. తరువాత కాలేజ్ అమ్మాయి స్నేహితుడి మీద నిందితులు దాడి చేశారు. అమ్మాయి స్నేహితుడు కేకలు వేయకుండా అతని నోరుమూసిపెట్టారు.

 నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లి

నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లి

కాలేజ్ అమ్మాయిని, ఆమె స్నేహితుడిని నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లారు. తరువాత నీవు పూర్తిగా బట్టలు తీసివేయాలని, లేదంటే నీ స్నేహితుడిని చంపేస్తామని నిందితులు కాలేజ్ అమ్మాయిని బెదిరించారు. బట్టలు విప్పడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో స్నేహితుడి మీద మళ్లీ దాడి చేసిన నిందితులు కాలేజ్ అమ్మాయికి కత్తులు చూపించి ఆమెను భయబ్రాంతులకు గురి చేశారు.

గ్యాంగ్ రేప్, మొబైల్ లో వీడియోలు

గ్యాంగ్ రేప్, మొబైల్ లో వీడియోలు

యువతిని బెదిరించి నగ్నంగా చేసిన కామంధులు ఆరు మంది ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి పార్క్ నుంచి బయటకు పంపించకుండా నిందితులు కామవాంఛ తీర్చుకున్నారు. అత్యాచారం చేసే సమయంలో నిందితులు పూర్తిగా మొబైలో వీడియోలు తీశారు. కేకలు వేస్తే ఇద్దర్నీ చంపేస్తామని బెదిరించారు. రాత్రి కాలేజ్ అమ్మాయికి చిత్రహింసలు పెట్టిన నిందితులు విషయం బయటకు చెబితే మీ ప్రాణాలు తీస్తామని, మొబైల్ లోని వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి ఇద్దర్నీ వదిలేశారు.

 తల్లికి చెప్పిన అమ్మాయి

తల్లికి చెప్పిన అమ్మాయి

మరుసటి రోజు కాలేజ్ అమ్మాయి జరిగిన విషయం మొత్తం ఆమె తల్లికి చెప్పింది. కాలేజ్ అమ్మాయి, ఆమె తల్లి ఎస్ఆర్ పుర మహిళా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో టీ. రాహుల్ (21), ఆర్. ప్రకాష్ (22), ఎస్. కార్తికేయన్ (28), నారాయణమూర్తి (30) అనే నిందితులను శ్రీరాణైచెన్నపాళ్యం సమీపంలో అరెస్టు చేశారు.

గ్యాంగ్ లీడర్ ప్లాన్

గ్యాంగ్ లీడర్ ప్లాన్

కాలేజ్ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (గ్యాంగ్ లీడర్)తో సహ మరో నిందితుడు పరారైనారు. కాలేజ్ అమ్మాయి మీద అత్యాచారం చెయ్యాలని నిందితులను గ్యాంగ్ లీడర్ రెచ్చగొట్టాడని పోలీసులు అంటున్నారు. నిందితులు అందర్నీ కోయంబత్తూరు మహిళ కోర్టు ముందు హాజరుపరచడంతో కామాంధులను రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నలుగురు కామాంధులను కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Coimbatore: The girl had gone to a park with a male friend on November 26 to celebrate her birthday. While she was returning from the park at around 9 pm, the men assaulted the male friend, dragged her to a secluded place and then raped her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more