ఫరిదాబాద్‌లో ఘోరం: బెదిరించి, ఏడేళ్లుగా సోదరిపై పలుమార్లు రేప్
ఫరీదాబాద్: ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. పద్నాలుగేళ్ల బాలిక పైన సోదరుడే దారుణానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. ఫరీదాబాద్ జిల్లాలోని సంత్ నగర్ పరిధిలోని ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు మంగళవారం నాడు చెప్పారు.
గత ఏడేళ్లుగా 14 ఏళ్ల బాలిక పైన సోదరుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడేళ్ల క్రితం తన తల్లి మృతి చెందిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుండి తాను తన సోదరుడితో కలిసి జీవిస్తున్నానని చెప్పింది.

అప్పటి నుండి అంటే ఏడేళ్లుగా తనను తన సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడని తెలిపింది. పోలీసులు సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications