ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై యువకుడు రేప్

పోలీసుల కథనం ప్రకారం.. బగ్బత్ జిల్లాలోని బరౌటా ప్రాంతంలో బాధితురాలు తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. సోమవారం కుటుంబసభ్యులందరూ పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. బాధిత అమ్మాయి(12) ఒక్కతే ఇంట్లో ఉంది.
ఇది గమనించిన పొరుగింటి యువకుడు ఆమెపై దాడి చేసి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పిన పోలీసులు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని పార్థాపూర్ ప్రాంతంలో దళిత అమ్మాయిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గడ్డి కోసుకు రావడానికి పొలానికి వెళ్లిన 15ఏళ్ల అమ్మాయిపై దుండగుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగివచ్చిన బాధితులు తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications