దారుణం: బాలికపై ఏడాది అత్యాచారం, గర్భవతి

థానేకు చెదిన ముంబ్రా పట్టణంలోని కౌసా ప్రాంతంలోని సైనిక్ నగర్‌కు చెందిన రహీం నిరుడు అక్టోబర్ నుంచి అమ్మాయిపై లైందిక దాడికి పాల్పడుతున్నట్లు ముంబ్రా పోలీసు స్టేషన్ హెచ్ఎస్ కామరాజ్ చెప్పారు. పలు ప్రాంతాల్లో అమ్మాయిపై అతను ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ వరకు అత్యాచారం చేసినట్లు ఆయన చెప్పారు
తన ఇంట్లోనూ, అమ్మాయి ఇంట్లోనూ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రదేశాల్లోనూ అమ్మాయిపై రహీం అత్యాచారం చేశాడు. విషయాన్ని బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అతను బాలికను బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు.
బాలికకు ఇప్పుడు మూడు నెలల గర్భం. పరీక్షల కోసం ఆమెను థానే సివిల్ ఆస్పత్రికి పంపించారు. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు కామరాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications