బాలికపై వరుసగా గ్యాంగ్ రేప్: ఆరుగురి అరెస్టు

ముంబై: మైనర్ పై కామాంధులు సామూహిక అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నది. ఆరుగురు కామంధులను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ముంబై నగర శివార్లలోని సుబర్బన్ చెంబూరు ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. చెంబూరు లోని ఒక హౌసింగ్ సోసైటిలోని ఒక భవనంలోకి 15 సంవత్సరాల బాలికను తీసుకు వెళ్లారు. తరువాత బాలిక నోట్లో బట్టలు కుక్కారు.

ఆ సమయంలో అక్కడ ఉన్న కామాంధులు వరుసగా బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. చివరికి బాలిక సృహతప్పడంతో నిందితులు అక్కడి నుండి పరారైనారు. అటువైపు వెళుతున్న వారు అనుమానస్పదంగా సంచరిస్తున్న నిందితులను గుర్తించారు.

 A minor girl was allegedly gang-raped in Mumbai

వెంటనే సమీపంలోని తిలక్ నగర పోలీసులకు సమాచారం అందించారు. తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ భగత్ సోనవానే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని రాజావాడి ఆసుపత్రికి తరలించారు.

సృహలోకి వచ్చిన యువతి తెలిపిన వివరాల ఆదారంగా పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన వారిలో యువతికి పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నాడని పోలీసులు అన్నారు. కట్టడం యజమాని సైతం పరారైనాడని, అందరి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి భగత్ సోనవానే తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+