టీవీ నటిపై మైనర్ వేధింపులు: వాట్సప్‌లో అశ్లీల ఫోటోలు
ముంబై: ముంబైలో ఓ టీవీ నటిపై వేధింపులకు పాల్పడిన 16 ఏళ్ల మైనర్ బాలుడిని బంగూర్ నగర్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం బుల్లితెరపై ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఓ చిన్న నటిపై ముంబైలోని దహిసర్ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు.
పలు టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించిన సదరు నటికి అశ్లీల ఫొటోలను చేజిక్కించుకున్న ఆ మైనర్, వాటిని ఆమె వాట్సప్‌కు పంపి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. నటికి చెందిన అశ్లీల ఫోటోలను ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా సైట్ల నుంచే హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం వాట్సప్‌లో నటికి పంపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 5 లక్షలు ముట్టజెప్పాలని ఆమెను బెదిరించాడు. దీంతో భయపడిన సదరు నటి బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఉదయం ఆ మైనర్ బాలుడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దహిసర్ తూర్పు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా సదరు నటిని బెదిరించిన తీరులోనే గతంలో మరో ముగ్గురు నటీమణులను కూడా మైనర్ వేధించాడని పోలీసులు తెలిపారు.
కాగా, మైనర్ గత ఆరు నెలలుగా తన స్నేహితునితో కలిసి నల్లాసోపారా ప్రాంతంలో నివసిస్తున్నాడు. జార్ఖండ్‌కు చెందిన ఈ మైనర్ మధ్యలోనే చదువు ఆపేసి ఉద్యోగ నిమిత్తం ముంబైకు వచ్చినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications