మైనర్‌బాలికపై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం: విందు ఇవ్వాలని డిమాండ్
భువనేశ్వర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత మరచి మానవమృగంలా చిన్నారిపై అకృత్యానికి ఒడిగట్డాడు. అంతేకాదు ఆ బాలిక గర్భం దాల్చిందని గ్రామానికి విందు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకొంది.
ఆ బాలికకు అండగా ఉండాల్సింది పోయి, ఆమె కుటుంబాన్ని వూరి నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా పాపపరిహారంగా గ్రామమంతటికీ విందు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని కోరాపుట్‌లో చోటుచేసుకుంది.
బల్దా ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు అతడిపై కేసు పెట్టారు.
మూడు వారాల క్రితం ఆ హెడ్‌మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే విషయం తెలిసేనాటికే ఆమె ఐదు నెలల గర్భిణి కావడంతో అబార్షన్‌కు వైద్యులు నిరాకరించారు.

ఇదిలా ఉండగా ఘటన గురించి తెలిసిన గ్రామస్థులు బాలిక కుటుంబం విషయంలో అమానవీయంగా ప్రవర్తించారు. వారు వెంటనే వూరు నుంచి వెళ్లిపోవాలంటూ సామాజిక బహిష్కరణ విధించారు.
అంతేగాక పెళ్లికి ముందే బాలిక గర్భం దాల్చడంతో పాపపరిహారంగా గ్రామస్థులకు విందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అధికారుల దాకా వెళ్లినప్పటికీ గ్రామస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications