ఏడాదిగా విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్ రేప్: వాట్సప్‌లో వీడియో!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. సత్ప్రర్తన, మంచి విద్యాబుద్ధులతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన ఓ స్కూల్ డైరెక్టరే కామాంధుడిగా మారాడు. దాదాపు 20 మందికి పైగా అమ్మాయిలను వేధించాడు. అంతేగాక, ఓ విద్యార్థినిపై లైంగికదాడి చేశాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలోని ఈటాలో ఓ పాఠశాల డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు నిందితుడు జితేందర్ సింగ్ యాదవ్. కాగా, పాఠశాలలోని పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు.

అంతేగాక, ఓ 15ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. ఆమె బతిమాలినా వినకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ కామాంధుడు.. విద్యార్థినితో గడిపిన వీడియోను వాట్సప్‌లో పోస్ట్ చేశాడు.
కాగా, దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పినట్లు చేయకపోతే వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించేవాడని ఆమె తెలిపింది. అతని ఉచ్చులో చిక్కుకుని 20 మందికి పైగా బాలికలు నరకం అనుభవిస్తున్నారని ఆ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు బగ్వాలా ప్రాంతంలోని శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications