వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోం నుంచి మైనర్ల పరారీ: మహిళ హత్య, దోపిడీ

|
Google Oneindia TeluguNews

Delhi
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి 50 కిలోల వెండిని ఐదుగురు దుండగులు అపహరించుకుపోయారు. కాగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితులలో ఇద్దరు మైనర్లు ఉన్నారని, వారు జువైనల్ హోం నుంచి పరారై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితులు మహేష్ గుప్తా అలియాస్ సన్నీ(24), అజయ్ రాయ్(35), నర్సింగ్ కుమార్ వర్మ(35)లతోపాటు జువైనల్ హోం నుంచి తప్పించుకున్న ఇద్దరు మైనర్లను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. నిందితులలో మహేష్ గుప్తా పేరు మోసిన దొంగ అని, అతనికి జువెల్లర్‌గా పనిచేస్తున్న నర్సింగ్ ఈ దొంగతనానికి సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

రెండు బైకులు, రెండు తుపాకులు, నాలుగు క్యాట్రిడ్జులతోపాటు సుమారు రూ. 25 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగతనంలో జువైనల్ హోంకు చెందిన మరో ముగ్గురు మైనర్ల పాత్ర కూడా ఉందని పోలీసులు చెప్పారు. నవంబర్ 7వ తేదీని ఈ దొంగతనం, హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. వెండి ఆభరణాల వ్యాపారం నిర్వహించే అజయ్ గుప్తా ఇంట్లో లేని సమయంలో నిందితులు అతని ఇంట్లోకి ప్రవేశించి అతని భార్య మధుబాలను హత్య చేసి 50 కిలో వెండిని అపహరించుకుపోయారు.

తమ తల్లిని హత్య చేయడంతో అక్కడే ఉన్న చిన్నారులు కేకలు వేశారు. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అశోక్ నగర్‌లో కేబుల్ ఆపరేట్‌గా సన్నీ పేరుతో విధులు నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడైన మహేష్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో మిగితా నిందితుల వివరాలను తెలిపాడు. దీంతో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

English summary
Five persons, including two juveniles, have been arrested for allegedly stealing 50 kg of silver ornaments from the house of a woman after strangulating her to death in east Delhi, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X