Girl: ఇంట్లో 9 ఏళ్ల అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీసిన మైనర్లు. పక్కింటిలో ఉంటూ?
లక్నో/ఉత్తరప్రదేశ్: దేశంలో అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా పోక్సో చట్టం కింద ఎక్కువ అత్యాచార కేసులు నమోదవుతున్నాయని వెలుగు చూడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో మైనర్ యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో 9 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా నిందితులు అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో నీ వీడియోలు పోస్ట్ చేసి వైరల్ చేస్తానని బెదిరించారని పోలీసులు తెలిపారు.

బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు హైవే పోలీస్ స్టేషన్ అధికారి ఛోటే లాల్ స్థానిక మీడియాకు చెప్పారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శనివారం సాయంత్రం ఇద్దరు మైనర్ అబ్బాయిలో ఆమె ఇంటిలోకి చొరబడి ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి వీడియోలు తీశారని పోలీసు అధికారులు చెప్పారు.
అమ్మాయి ఇంటి ఇరుగుపొరుగున ఉండే అబ్బాయిలు మొదట ఇంట్లోకి ప్రవేశించి ఆమెను వేధించడం ప్రారంభించారు. బాధితురాలు ప్రతిఘటించడంతో అత్యాచారం చేశారని బాధితురాలి బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోలు తీసి ఈ మ్యాటర్ ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన నిందితులు కూడా మైనర్లే అని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications