షాక్: 6 సార్లు హార్ట్ స్ట్రోక్, బతికిన 4 నెలల విదిషా

నాలుగు నెలల వయస్సున్న విదిషాకు ఆరు నెలల కాలంలో గుండెపోటు వచ్చింది.ఈ గుండెపోటుతో ఆమె బతికిబయటపడింది.అయితే ఆ బేబీని మిరాకిల్ బేబీ అంటూ ఆసుపత్రి వర్గాలు పిలుస్తున్నాయి. మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి బతకడం

ముంబై: నాలుగు నెలల వయస్సున్న విదిషాకు ఆరు నెలల కాలంలో గుండెపోటు వచ్చింది.ఈ గుండెపోటుతో ఆమె బతికిబయటపడింది.అయితే ఆ బేబీని మిరాకిల్ బేబీ అంటూ ఆసుపత్రి వర్గాలు పిలుస్తున్నాయి. మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి బతకడం ఆ బాలికకే చెల్లింది.

నాలుగు నెలల విదిష అరుదైన వ్యాధితో బాధపడుతోంది. మృత్యుంజయురాలిగా ఆమెను పిలుస్తున్నారు.45 రోజుల వయస్సున్న సమయంలో ఆ బాలిక వాంతి చేసుకొంది. వెంటనే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది.

‘Miracle baby’ survives 12-hour operation, six heart attacks

దీంతో షాక్ కు గురైన తల్లిదండ్రులు వైశాఖ, వినోద్ లు విదిషను గట్టిగా ఊపడంతో ఆమె మేల్కోంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయింది.దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

వైద్యుడి సూచనతో బీజే వాడియా ఆసుపత్రికి పాపను తరలించారు. విదిషకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గుండె సాధారణ స్థితికి వ్యతిరేకంగా పనిచేస్తోందని చెప్పారు. దాదాపుగా 12 గంటలపాటు శ్రమించి గుండెకు ఆపరేషన్ నిర్వహించారు. ఇక్కడి నుండి మరింత కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంది విదిష.

ఆపరేషన్ పూర్తైన తర్వాత విదిష శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడసాగింది. శరీరంలోని రక్తానికి మూడొంతుల ఆక్సిజన్ అవసరమైతే కేవలం ఒక వంతు మాత్రమే ఆక్సిజన్ ను అందించడం ప్రారంభించాయి. కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి రక్తంలో మూడొంతులకు పెరగడంతో విదిషకు ఆరుసార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది.

దాదాపు 51 రోజుల పాటు ఐసీయూలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ఒకానొక సమయంలో 15 నిమిషాల పాటు విదిష గుండెను కృత్రిమంగా కొట్టుకొనేలా చేయాల్సివచ్చిందని డాక్టర్లు చెప్పారు.ప్రస్తుతం విదిష పూర్తిగా కోలుకొందని మరో రెండు రోజుల్లో బేబిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు వైద్యులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+