Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శిశువు చనిపోయిందని ప్రకటించిన డాక్టర్లు.. అంతక్రియల్లో లేచి ఏడవడంతో..

మన చుట్టూనే ఒక్కోసారి వింత ఘటనలు జరుగుతుంటాయి. ఆ శిశువు నెలల ముందే జన్మించింది. అయితే పుట్టగానే శిశువు చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు ఆ తల్లిదండ్రులు. అయితే అంతలోనే అద్భుతం జరిగింది. శిశువు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆ పసికందు ఏడ్చింది. దీంతో శిశువు తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అప్పుడే పుట్టిన శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పడంతో శోకసంద్రంలో మునుగుతూ ఆ బిడ్డను తమ గ్రామానికి తీసుకెళ్లి అంతక్రియలు చేస్తుండగా ఆ శిశువు ఏడుపు వినిపించింది. ఒక్కసారిగా షాక్ తిన్న తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన శిశువును ఆసుపత్రికి తరళించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ఇందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్​ చేశారు.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయ్ లోని స్వామీ రామానంద తీర్థ ప్రభుత్వాసుపత్రిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళకు అప్పుడే పుట్టిన బిడ్డను వైద్యులు నిర్లక్ష్యంగా ఎలాంటి పరీక్షలు చేయకుండానే శిశువు చనిపోయిందని ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ బిడ్డను తమ గ్రామానికి తీసుకెళ్లి అంతక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శిశువు ముఖంపై ఉన్న వస్త్రాన్ని తీశారు.

Miracle in Beed Baby Declared Dead by Doctors Cries at Funeral

దీంతో ఒక్కసారిగా ఆ శిశువు లేచి ఏడ్చింది. వెంటనే బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అయితే డాక్టర్లు మాత్రం శిశువు నెలల ముందే పుట్టిందని.. ఎలాంటి కదలికలు లేవని అందుకే చనిపోయినట్లు భావించామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+