ఆ సీటు మహిమ.. విమాన ప్రమాదంలో ఒక్కరు కాదు ఇద్దరు బతికారు..!
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.
అయితే ఇంతటి ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రమే బతికి బయట పడ్డాడు. అతడే 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేశ్. అతడు 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కుప్పకూలిన ఘటనలో అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు విశ్వాస్ కుమార్ రమేశ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
అయితే సరిగ్గా 27 ఏళ్ల క్రితం జరిగిన ఇలాంటి విమాన ప్రమాదంలో 11A సీటులోనే కూర్చొన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. 1998లో ఈ ఘటన జరిగింది. లాయ్ చుశాక్ అనే వ్యక్తి TG261 అనే విమానంలో 1998లో బ్యాంకాక్ నుంచి థాయ్ లాండ్ వెళ్తున్న క్రమంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ వారిలో 11A సీటులో కూర్చొన్న లాయ్ చుశాక్ అనే వ్యక్తి కూడా ఒకరు.

ఈ విషయం తెలిసిన నెటిజెన్లు 11A సీటు గురించి ఆరా తీయడం ప్రారంభించారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కాదు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications