పాముకు CPR చేశాడు- ఏం గుండె రా వీడిది

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. విద్యుద్ఘాతానికి గురైన ఓ పాముకు వన్యప్రాణి రక్షకుడు ముఖేష్ వయాడ్ మౌత్-టు-మౌత్ సీపీఆర్ అందించి ప్రాణం పోశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో లక్షలాది వీక్షకులను ఆకట్టుకుంది. ముఖేష్ చేసిన పనికి ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓ పాముకు ప్రాణం పోయడం అంటే మాటలు కాదని చెబుతున్నారు.

ఈ ఘటన పొలాల్లో పనిచేస్తున్న కూలీల కళ్ళ ముందు జరిగింది. ఉదయం వ్యవసాయ కూలీలు పనిలో ఉండగా.. ఓ పాము విద్యుత్ స్తంభం ఎక్కడాన్ని గమనించారు. దీన్ని చూసి వాళ్లు స్పందించేలోపే అది హైఓల్టేజ్ విద్యుత్ తీగపైకి ఎక్కింది. వెంటనే విద్యుద్ఘాతానికి గురైంది. సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడింది. ఆ సర్పంలో చలనం లేకపోవడంతో కూలీలందరూ ఆందోళన చెందారు. దాన్ని బతికించాలని భావించారు.

Miracle Save Mouth-to-Mouth CPR Brings Life Back to Electrocuted Snake in Gujarat

వెంటనే వన్యప్రాణి సంరక్షకుడు ముఖేష్ వయాడ్‌ను పిలిచారు. ఆయన స్నేక్ క్యాచర్ కూడా. చుట్టు పక్కల గ్రామాల్లో ఇళ్లల్లో పాములు కనిపిస్తే వెంటనే ఆయనకు సమాచారం అందిస్తుంటారక్కడి ప్రజలు. సీపీఆర్ వంటి అత్యవసర పరిస్థితులపై తరచుగా గ్రామాల్లో అవగాహన శిబిరాలను నిర్వహిస్తుంటారు. పాము విద్యుత్ షాక్ గురైన విషయాన్ని కూడా ఆయనకు తెలియజేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, పామును పరిశీలించాడు.

షాక్ కు గురైనందున అది బతికే అవకాశం ఉందని భావించారు. దానికి ప్రాణం పోయాలనే తపనతో, వెంటనే నోటి ద్వారా సీపీఆర్ చేయడం మొదలుపెట్టారు. మౌత్-టు-మౌత్ సీపీఆర్ అందించాడు. పాముకు ఊపిరి ఊదాడు. కొంత సమయం తర్వాత పాము శరీరంలో మెల్లగా కదలికలు కనిపించాయి. కొద్దిసేపటికే, అది పూర్తిగా కోలుకుని జరజరమని పాక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ సాహసోపేతమైన చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+