వాషింగ్ మెషీన్‌లు ఇరుక్కున్న రెండేళ్ల బాలుడు, సేఫ్
బెంగళూరు: రెండేళ్ల బాలుడు వాషింగ్ మెషీన్‌లో చిక్కుకొని, ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఈ ఘటన కర్నాటకలో జరిగింది. తల్లి ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో ఈ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఓ కుర్చీ పైకి ఎక్కి వాషింగ్ మెషీన్‌లోకి దిగాడు.

ఆడుకున్నంత సేపూ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత బయటికి రావడానికి ప్రయత్నిస్తుండగా కాళ్లు అందులో ఇరుక్కుపోయాయి. దీంతో ఏడుపు లంఘించుకున్నాడు. తల్లిదండ్రులు వచ్చి బాబును బయటకి తీయడానికి ప్రయత్నించారు.
ఎంత ప్రయత్నించినా కుదరక పోవడంతో పక్కింటి వారి సహాయంతో వాషింగ్ మెషీన్‌ను జాగ్రత్తగా కట్ చేయించారు. దాదాపు అరగంట తర్వాత ఎటువంటి గాయాలు కాకుండా బాబు బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications